Redmi 13 5G సేల్ మొదలైంది! రూ.12,999 కే, 108MP కెమెరా ఫోన్! సేల్ ఆఫర్లు
షియోమీ సబ్ బ్రాండ్ Redmi ఇటీవలే, తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Redmi 13 5G ని లాంచ్ చేసింది. లాంచ్ అయిన తర్వాత, ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో మొదటి సేల్ ఈ రోజు మొదలైంది. Redmi 13 5G దాని ముందున్న Redmi 12 5G కి అప్‌గ్రేడ్ గా వస్తుంది. Redmi 13 5G కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది మరియు స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 AE చిప్ ద్వారా శక్తిని పొందుతుంది.
కొత్త Redmi 13 5G కంపెనీ యొక్క కొత్త HyperOSతో వస్తుంది. మొత్తంమీద, స్మార్ట్‌ఫోన్ ధర ఆధారంగా అంచనాలకు అనుగుణంగా ఉంటుంది.ఇప్పుడు అమెజాన్ సేల్ లో ధర ,ఆఫర్లు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Redmi 13 5G: ధర మరియు లభ్యత వివరాలు
Redmi 13 5G అమెజాన్‌లో కొనుగోలుదారులకు ఈ రోజు 12PM నుండి అందుబాటులో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 6GB RAM మరియు 128GB స్టోరేజ్ యొక్క ప్రామాణిక వేరియంట్ కోసం స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 13,999 వద్ద ప్రారంభించబడింది. కానీ ఆఫర్లతో యూజర్ రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. అంటే ఆఫర్ తర్వాత రూ. 12,999 కే మీరు కొనుగోలు చేయవచ్చు.
అలాగే, స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB RAM మరియు 128GB స్టోరేజ్ యొక్క వేరియంట్ కోసం స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 15,499 వద్ద ప్రారంభించబడింది. కానీ ఆఫర్లతో యూజర్ రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. అంటే ఆఫర్ తర్వాత రూ. 14,499 కే మీరు కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ లు వనిల్లా, ఓషన్ బ్లూ, పెరల్ పింక్ మరియు మిడ్నైట్ బ్లాక్ రంగులలో వస్తాయి. కంపెనీ ఆఫర్‌తో పాటు, Amazon ఎక్స్చేంజి ఆఫర్ అందిస్తోంది.
Redmi 13 5G స్పెసిఫికేషన్ల వివరాలు
రెడ్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) తో ఆండ్రాయిడ్ 14 పై Xiaomi యొక్క HyperOS స్కిన్‌తో పనిచేస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 6.79-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ నుండి 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 AE SoC ద్వారా ఆధారపడి పనిచేస్తుంది. గరిష్టంగా 8GB RAM తో జత చేయబడింది.
ఫోటోలు మరియు వీడియోల కోసం, Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ 108-మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ISOCELL HM6 సెన్సార్ మరియు f/1.75 అపెర్చర్‌తో అమర్చబడింది. ప్రైమరీ కెమెరా 3x ఇన్-సెన్సర్ జూమ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.ఈ ఫోన్ 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో కూడా ఉంది. వీడియో చాట్‌లు మరియు సెల్ఫీల కోసం, ఇది డిస్‌ప్లేపై హోల్-పంచ్ కటౌట్‌లో ఉన్న 13-మెగాపిక్సెల్ ముందువైపు కెమెరాను కలిగి ఉంటుంది.
మీరు Redmi 13 5Gలో 128GB స్టోరేజీ ని పొందుతారు. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో డేటా బదిలీల కోసం USB టైప్-సి పోర్ట్ కూడా ఉంది మరియు 5030mAh బ్యాటరీ 33W వద్ద ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది.
Redmi 13 5G లోని సెన్సార్‌లు గమనిస్తే యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఇ-కంపాస్, సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ వివిధ గృహోపకరణాలను నియంత్రించడానికి ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ (IR) ట్రాన్స్‌మిటర్‌ను కూడా కలిగి ఉంది. ఇది బయోమెట్రిక్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది 168.6x76.28x8.3mm కొలుస్తుంది మరియు 205g బరువు ఉంటుంది.


Click it and Unblock the Notifications








