108MP కెమెరా, 5030mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ ఖరారు.. పూర్తి వివరాలు..!
రెడ్‌మి కొత్త 5G స్మార్ట్ ఫోన్ భారత్ విడుదల తేదీ ఖరారు అయింది. బడ్జెట్ ధర సెగ్మెంట్ లో అందుబాటులోకి రానుంది. రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ (Redmi 13 5G Smartphone Launch Date) భారత్‌లో జులై 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. దీంతోపాటు స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల వివరాలను వెల్లడించింది. ఈ రెడ్‌మి కొత్త హ్యాండ్ సెట్ ఆకట్టుకొనే డిజైన్ ను కలిగి ఉంది. విడుదల అనంతరం ప్రముఖ ఈ - కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
30W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5030mAh బ్యాటరీ.. :
రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుందని షియోమీ తెలిపింది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు తో 5030mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 ద్వారా రక్షణ : దీంతోపాటు సంస్థ విడుదల చేసిన ఫొటోల (Redmi Upcoming Smartphone) ద్వారా ఈ రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ శాండ్విచ్ డిజైన్ తో రానుంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 ద్వారా డిస్‌ప్లే రక్షణను పొందుతుంది. రెడ్‌మి 12 5G స్మార్ట్ ఫోన్ కు తర్వాత తరం వెర్షన్ గా రెడ్‌మి 13 5G అందుబాటులోకి వస్తోందని తెలుస్తోంది.
108MP ప్రధాన కెమెరా.. :
రెడ్‌మి 13 5G హ్యాండ్ సెట్ భారీ డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని షియోమీ వెల్లడించింది. అయితే కచ్చితమైన వివరాలను ప్రకటన చేయలేదు. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరా సహా మరో కెమెరా ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

రెండు రంగుల్లో లభిస్తుంది.. :
రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. లైట్ బ్లూ, లైట్ పింక్ రంగుల్లో లభిస్తుంది. రెండు వైపులా గ్లాస్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అంటే వెనుక వైపు గ్లాస్ మరియు ముందువైపు కూడా డిస్‌ప్లే.. గొరెల్లా గ్లాస్ 3 రక్షణకు కలిగి ఉంటుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








