108MP కెమెరా, 5030mAh బ్యాటరీతో రెడ్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్.. రేపే విడుదల..!
షియోమీ నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ (Redmi 13 5G Smartphone Launch Date) విడుదల కానుంది. ఈ రెడ్‌మి కొత్త హ్యాండ్ సెట్ క్రిస్టల్ గ్లాస్ డిజైన్ ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫోన్ ప్రీమియం అనుభూతి కలుగుతుందని రెడ్‌మి చెబుతోంది. గత సంవత్సరం విడుదలైన రెడ్‌మి 12 5G ఫోన్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్ గా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే విడుదలకు ముందు రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్ లు విడుదల అయ్యాయి.
కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణ, పంచ్ హోల్ నాచ్ డిజైన్ :
రెడ్‌మి వెల్లడించిన వివరాల ఆధారంగా రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ (Redmi 13 5G Specifications) 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్ తో అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ పంచ్ హోల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీ :
రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. మరియు HyperOS పైన పనిచేస్తుంది. దీని ద్వారా మెరుగైన అనుభూతిని కలుగుతుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్ సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.
108MP ప్రధాన కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రెడ్‌మి కొత్త స్మార్ట్ ఫోన్ వెనుక వైపు 108MP ప్రధాన కెమెరా సహా 2MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చినట్లు తెలిసింది. అయితే ఈ హ్యాండ్ సెట్ ర్యామ్, స్టోరేజీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమెజాన్ ద్వారా సేల్ :
రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.15,000 కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే కచ్చితమైన ధరపై వివరాలను సంస్థ వెల్లడించలేదు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. అనంతరం అమెజాన్ ( Amazon ) ద్వారా సేల్ నిర్వహించనున్నారు. అయితే ఈ ధరలో మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు కలిగి ఉన్న హ్యాండ్‌సెట్‌గా ఉండే అవకాశం ఉంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








