Home
Mobile

Hyper OS, స్నాప్‌ డ్రాగన్ చిప్‌సెట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ప్రస్తుతం రెడ్‌మి 13 5G స్మార్ట్‌ ఫోన్‌ను (Redmi 13 5G Smartphone) లాంచ్‌ చేయనుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్ భారత్‌లోనూ విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ పోకో M7 ప్రో 5G (Poco M7 Pro 5G) పేరుతో లాంచ్‌ కానుందని సమాచారం.

ఆండ్రాయిడ్‌ హెడ్‌లైన్స్‌ నివేదిక ప్రకారం ఈ హ్యాండ్‌ సెట్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ నివేదికల ప్రకారం ఈ రెడ్‌మి 13 5G స్మార్ట్‌ ఫోన్‌ వేర్వేరు మోడల్‌ నంబర్లను కలిగి ఉంది. 2406ERN9CI, 2406ERN9CC, 24066PC95I మోడల్‌ నంబర్లలో అందుబాటులో ఉంది.

redmi 13 5G may debut in india as poco M7 pro 5g

భారత్‌ మార్కెట్‌లో పోకో బ్రాండ్‌తో విడుదల :
ఇందులో RN అంటే రెడ్‌మీ మోడల్‌, అదే PC అంటే పోకో బ్రాండ్‌ పేరుతో విడుదల కానుందని అర్థం. అదే 24066PC95I అంటే పోకో పేరుతో భారత్‌లో విడుదల కానుందని అర్థం. అయితే స్మార్ట్‌ ఫోన్‌ పేరుతో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

రెడ్‌మి 13 5G హ్యాండ్‌ సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hyper OS ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే గత మోడల్‌ రెడ్‌మి 12 5G కంటే చిన్న చిన్న మార్పులు మాత్రమే కలిగి ఉండే అవకాశం ఉంది. రెడ్‌మి 12 5G స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. మరియు 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కొన్ని అప్‌గ్రేడ్‌లతో రెడ్‌మి 13 5G విడుదలయ్యే ఛాన్స్‌ :
రెడ్‌మి 12 5G హ్యాండ్‌ సెట్‌ 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుకవైపు LED ఫ్లాష్‌తో వచ్చింది. అయితే కొద్ది పాటు అప్‌గ్రేడ్‌లతో రెడ్‌మి 13 5G హ్యాండ్‌సెట్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది.

ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌..!! :
రెడ్‌మి 12 5G 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.10,999 గా ఉంది. అదే 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. అయితే రెడ్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
redmi 13 5G to launch confirmed but maybe named as poco in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X