Home
Mobile

ధర రూ.8999 కే 6.74 అంగుళాల డిస్‌ప్లే. 50MP కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

రెడ్‌మి నుంచి గత నెలలో రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. బడ్జెట్‌ రేంజ్‌లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ హ్యాండ్‌సెట్ కంటే ముందు వెర్షన్‌ రెడ్‌మి 13C 5G స్మార్ట్‌ఫోన్‌ను (Redmi 13C 5G Smartphone)ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ HD+ డిస్‌ప్లేతోపాటు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

భారత్‌ మార్కెట్‌లో ఈ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తోంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Redmi 13c 5G smartphone telugu news

ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి 13c 5G ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.8999 కే సొంతం చేసుకోవచ్చు. అయితే మరో ప్రముఖ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.10699 కే సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మి 13c 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రెడ్‌మి 13c 5G స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6,74 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్‌ గరిష్ఠ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతుంది.

Redmi 13c 5G smartphone telugu news

ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను అమర్చారు. f/1.8 అపేచ‌ర్‌తో 50MP AI కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలతో అందుబాటులో ఉంది. ఈ బ్యాక్‌ కెమెరాలు నైట్‌ మోడ్, పొర్ట్రెయిట్‌ మోడ్‌ను సపోర్టు చేస్తాయి. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ రెడ్‌మి ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh ‌బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, Wi-Fi, GPS, AGPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా అత్యంత ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 195 గ్రాములుగా ఉంది.

* ఇటీవల అందుబాటులోకి వచ్చిన రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS ను కలిగిఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

రెడ్‌మి 14C 5G వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 18W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యా్మ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 13c 5G smartphone gets best deal on flipkart check features and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X