Home
Mobile

రూ.10 వేల కంటే తక్కువ ధరలో భారీ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ సహా..!

రెడ్‌మి నుంచి ఇటీవల నోట్‌ 14 SE స్మార్ట్‌ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ రూ.15 వేల ధర రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సంవత్సరం తొలి రోజుల్లో రెడ్‌మి నుంచి 14c 5G స్మార్ట్‌ఫోన్‌ ( Redmi 14C 5G Smartphone ) విడుదల అయింది. ఈ ఫోన్‌ భారీ డిస్‌ప్లే, 50MP కెమెరాతోపాటు అనేక బెస్ట్‌ ఫీచర్‌ లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.10 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.

రూ.10 వేల కంటే తక్కువ ధరలో :
రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ ఫోన్‌ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో రూ.9498 కే కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Redmi 14c 5G smartphone

మూడు స్టోరేజీ వేరియంట్స్‌ :
అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ను రూ.10498, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.11498 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్టార్‌లైట్‌ బ్లూ, స్టార్‌డస్ట్‌ పర్పుల్‌, స్టార్‌ గేజ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV rheinland సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. IP52 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

Redmi 14c 5G smartphone

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు పొర్ట్రెయిట్‌ మోడ్‌, నైట్‌ మోడ్‌ ను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ రెడ్‌మి 14c 5G ఫోన్‌ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ ను కలిగి ఉంది. రూ.10 వేల కంటే తక్కువ ధరలో భారీ డిస్‌ప్లే కలిగిన ఫోన్‌ కావాలని భావిస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 14c 5G smartphone get best deal on amazon here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X