5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. రూ.9999 కే సూపర్ ఫీచర్లతో 5G ఫోన్ విడుదల..!
భారత్ మార్కెట్‌లో రెడ్‌మి నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. అది కూడా రూ.10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. గత సంవత్సరం లాంచ్ అయిన రెడ్‌మి 13C ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా తాజాగా రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ (Redmi 14c 5G Smartphone Launched) విడుదల అయింది. అయితే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు, ధర పూర్తి వివరాలు.
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం స్టార్‌లైట్ డిజైన్‌తో లాంచ్ అయింది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్కువ సమయం ఫోన్ వినియోగించినా కంటికి హాని కలగకుండా ఉండేందుకు వీలుగా ఈ ఫోన్ TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ రెడ్‌మి 5G ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అదనంగా 6GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS తో పనిచేస్తుంది.
స్టోరేజీ వివరాలు :
ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే వీలుంది.

50MP ప్రైమరీ కెమెరా :
ఈ రెడ్‌మి ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా సహా మరో లెన్స్‌ను అమర్చారు. నైట్ మోడ్, పొర్ట్రెయిట్ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ సెల్ఫీ కెమెరా బ్యూటీ మోడ్‌ను సపోర్టు చేస్తుంది.
5160mAh బ్యాటరీ :
బ్యాటరీ పరంగా ఈ ఫోన్ 18W వైర్ ఛార్జంగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలుతో రూ.1999 విలువైన 33W ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో ఉంది. కనెక్టివిటీ పరంగా రెండు సిమ్ కార్డులు 5G ను సపోర్టు చేస్తాయి.

రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ను 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్ గేజ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. జనవరి 10 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. mi.com, షియోమీ రిటైల్ అవుట్‌లెట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








