Home
Mobile

రూ.8999 కే 6.88 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌తో 5G ఫోన్‌!

రెడ్‌మి నుంచి ఇటీవల రెడ్‌మి నోట్‌ 14 SE 5G, రెడ్‌మి 15 స్మార్ట్‌ఫోన్‌ లు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం తొలి రోజుల్లో రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్‌ దీపావళి 2025 లో (Flipkart Big Bang Diwali 2025 Sale) భాగంగా రూ.10 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్ 2025 :
రెడ్‌మి నుంచి 14c 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi 14c 5G Smartphone) విడుదల సమయంలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.9999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌ లో భాగంగా రూ.8999 కే కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.10999 గా ఉండేది. ప్రస్తుతం రూ.9999 కే కొనుగోలు చేయవచ్చు.

Redmi 14c 5G Smartphone pricedrop

బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ :
ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌ 2025 లో భాగంగా రూ.10999 గా ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే TUV rheinland సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్టార్‌డస్ట్‌ పర్పుల్‌, స్టార్‌లైట్‌ బ్లూ, స్టార్‌ గేజ్‌ బ్లాక్‌ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని రెడ్‌మి హామీ ఇచ్చింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు పొర్ట్రెయిట్‌ మోడ్‌, నైట్‌ మోడ్‌ సపోర్టు చేస్తాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

5160mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 14c 5G Smartphone now available at Rs8999 price on flipkart big bang diwali 2025 sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X