రూ.10000 కంటే తక్కువ ధరలో మంచి 5G ఫోన్ కావాలనుకుంటే.. ఇది మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు..!
స్మార్ట్‌ఫోన్‌లకు భారత్ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. అందువల్ల ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల వరకు భారీగా విక్రయాలు నమోదు చేస్తుంటాయి. ముఖ్యంగా ఎంట్రీ, బడ్జెట్ రేంజ్ ఫోన్‌లకు మరింత డిమాండ్ ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెడ్‌మి నుంచి ఇటీవల రూ.10,000 కంటే తక్కువ ధరకే 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన అనేక అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.
రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్‌ను (Redmi 14C 5G Smartphone Sale) షియోమీ రిటైల్ అవుట్‌లెట్, mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్ గేజ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
రెడ్‌మి 14C 5G హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే TUV rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ప్రీమియం స్టార్‌లైట్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.
రెడ్‌మి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. వర్చువల్‌గా 6GB ర్యామ్ వరకు పొడిగించుకోవచ్చు. మరియు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని రెడ్‌మి చెబుతోంది. ఫోన్ 18W వైర్ ఛార్జంగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. రూ.1999 విలువ చేసే 33W ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి 14C 5G హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాను అమర్చి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు ఉన్న కెమెరాలు పొర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్‌ను సపోర్టు చేస్తాయి. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ సెల్ఫీ కెమెరా బ్యూటీ మోడ్‌ను కలిగి ఉంది.
డ్యూయల్ 5G సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఈ రెడ్‌మి 14C 5G ఫోన్ భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అది కూడా రూ.9999 కే కొనుగోలు చేయవచ్చు. గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎంచి ఆప్షన్ కానుంది.


Click it and Unblock the Notifications








