ధర రూ.13,999 కంటే తక్కువ ధరకే 6.88 అంగుళాల డిస్‌ప్లే, 5160mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్..!
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ (Redmi 14C 5G Smartphone) భారత్ మార్కెట్ లో జనవరి 6 వ తేదీన లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ (Amazon) ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ రెడ్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ 5160mAh బ్యాటరీతో విడుదల కానుంది. రెడ్‌మి 13c 5G కంటే ఆకట్టుకొనే డిజైన్ తో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా ఈ రెడ్‌మి 14c స్మార్ట్‌ఫోన్ డిజైన్ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి.
రెడ్‌మి 14C స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్ వినియోగించినా కంటికి ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండేలా ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. సర్టిఫైడ్ TUV లో బ్లూ లైట్, TUV ఫ్లిక్కర్ ప్రీ, TUV సర్కాడియన్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటుంది.

రెడ్‌మి 5G హ్యాండ్‌సెట్ మెరుగైన ఫర్మామెన్స్ కోసం 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ HyperOS తో పనిచేస్తుంది. అయితే హ్యాండ్‌సెట్ స్టోరేజీ వేరియంట్ ల వివరాలు తెలియాల్సి ఉంటుంది. అయితే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీతో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ వృత్తాకార ఐల్యాండ్ కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంటుంది. మరియు వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా సహా మరో సెకండరీ కెమెరాను అమర్చి ఉంటుంది. దీంతోపాటు ఈ కెమెరాలు కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ 5160mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఫోన్‌తోపాటు 33W ఛార్జర్ ను ఉచితంగా అందించనున్నట్లు రెడ్‌మి తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రిసిస్టెంట్ గా ఉండనుంది. సింగిల్ ఛార్జింగ్ తో రోజంతా వినియోగించుకోవచ్చని రెడ్‌మి చెబుతోంది.
దీంతోపాటు ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్ రంగుల్లో లభించనుంది. పర్పుల్, బ్లాక్ కలర్ వేరియంట్ లు మోనోక్రోమాటిక్ ప్యాట్రన్ ను కలిగి ఉంటాయి. అదే బ్లూ కలర్ వేరియంట్ కాస్త విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా ఎక్కువ రోజులు మన్నిక వస్తుందని తెలుస్తోంది.
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ అంచనా ధర వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ ధర వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేశారు. దీని ఆధారంగా రెడ్‌మి 14C స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంటుందని అంచనా వేశారు. అయితే ప్రారంభ ఆఫర్లతో ఈ ధర రూ.10,999 లేదా రూ.11,999 కి తగ్గే అవకాశం ఉందని తెలిపారు.


Click it and Unblock the Notifications








