కొత్త 5G ఫోన్ టీజర్‌ను విడుదల చేసిన ప్రముఖ సంస్థ.. విడుదల, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లోకి (Redmi 14C 5G Smartphone) త్వరలో విడుదల కానుంది. సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా లాంచ్ ను సంస్థ ధ్రువీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ 13C 5G స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి వస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తేదీని వెల్లడించలేదు. అయితే రెడ్‌మి ఇండియా సోషల్ మీడియా హ్యాండిల్ ఆధారంగా రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లోనూ అందుబాటులోకి రానుంది.
కీలక వివరాలు వెల్లడించిన రెడ్‌మి :
రెడ్‌మి ఇండియా టీజర్ ఆధారంగా 14C 5G స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఆకట్టుకుంటోంది. మరియు వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. అయితే త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్.. ఇటీవల కొన్ని గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన 14C 4G వేరియంట్‌ను పోలి ఉంది.

చైనాలో ఈ ఫోన్ తరహా డిజైన్‌ను కలిగి ఉంటుందా? :
దీంతోపాటు రెడ్‌మి 14C 5G హ్యాండ్‌సెట్.. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న Redmi 14R 5G తరహా డిజైన్‌ను కలిగి ఉంది. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ రెడ్‌మి 14C 5G ఇండియన్ వేరియంట్ ఫోటోను షేర్ చేశారు. భారత్ మార్కెట్‌లో 2025 తొలి రోజుల్లో లాంచ్ కానుందని తెలిపారు.
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.68 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల కానుందని సమాచారం. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేసే అవకాశం ఉంది.
Kick off the New Year with a bang! #2025G is coming your way.
— Redmi India (@RedmiIndia) December 23, 2024
Stay tuned! pic.twitter.com/ieL3J7qzgk
డ్యూయల్ కెమెరాలు, 5160mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 13MP ప్రైమరీ కెమెరా సహా మరో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చి ఉంటుంది. మరియు 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
బడ్జెట్ రేంజ్ ధరలో విడుదలయ్యే అవకాశం :
ఈ రెడ్‌మి ఫోన్ స్టోరేజీ వేరియంట్లు సహా ధర వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా రెడ్‌మి 13C 5G వేరియంట్ బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
[Exclusive] Redmi 14C 5G real-life image (Indian retail store) in Blue color.
— Mukul Sharma (@stufflistings) December 26, 2024
Looks cool IMO.
Might very well be the first smartphone launch of 2025.
Thoughts on the design? pic.twitter.com/1v03sZAYkI
భారత్ మార్కెట్‌లోకి ఈ నెలలో రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ ఫోన్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








