Home
Mobile

రూ.9499 కే 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే 5G ఫోన్‌..!

భారత్ మార్కెట్‌లో రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi 14C 5G Smartphone) ఈ సంవత్సరం జనవరిలో లాంచ్‌ అయింది. ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆకట్టుకొనే డిజైన్, కలర్‌ వేరియంట్స్‌తోపాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేశారు. రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.

రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్ల వివరాలు :
విడుదల సమయంలో రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.500 తగ్గింపు తో కొనుగోలు చేయవచ్చు.

Redmi 14C 5G Smartphone price cut

ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభం ధర రూ.9499 గా ఉంటుంది. మరియు ఇతర వేరియంట్స్‌ ధరలు రూ.10499, 11499 గా ఉన్నాయి. ఈ ఫోన్ మూడు రంగుల్లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అవి స్టార్‌ గేజ్‌ బ్లాక్‌, స్టార్‌ డస్ట్ పర్పుల్‌, స్టార్‌ లైట్‌ బ్లూ.

రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Adreno 613 GPU చిప్‌సెట్‌ కూడా కలిగి ఉంది. వర్చువర్‌ ర్యామ్ సదుపాయం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS ను కలిగి ఉంది.

Redmi 14C 5G Smartphone price cut

OS, ప్రాసెసర్‌ వివరాలు :
ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని రెడ్‌మి వెల్లడించింది. మరియు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

భారీ డిస్‌ప్లే :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ (1600*720 పిక్సల్స్‌) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 రక్షణను పొందుతుంది. TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

5160mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. వెనుక కెమెరాలు నైట్‌ మోడ్‌, పొర్ట్రియిట్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. 18W వైర్‌ ఛార్జింగ్‌తో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ రెడ్‌మి ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, FM రేడియో, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ను కూడా కలిగి ఉంది. కాలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ అవసరాల కోసం 5G ఫోన్‌ కావాలని భావించే వారికి ఈ రెడ్‌మి 14C 5G ఫోన్‌ సౌకర్యంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 14C 5G Smartphone with 50MP camera and 5160mAh battery price cut on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X