Home
Mobile

రూ.9999 ధరకే 6.88 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

రెడ్‌మి నుంచి ఈ సంవత్సరం జనవరిలో రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Redmi 14C 5G Smartphone) విడుదల చేసింది. రూ.10000 ధరలో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ధరలో బెస్ట్‌ ఫోన్‌ గా ఉంది. ఎంట్రీ లెవల్ ధరలో విడుదల అయినా.. 6.88 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ల వివరాలు. ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్‌ అనుకూలంగా ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌ ధర, కలర్ వేరియంట్‌ :
రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ ధర రూ.9999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యా్మ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. రెడ్‌మి ఇండియా, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. స్టార్‌డస్ట్‌ పర్పుల్‌, స్టార్‌లైట్‌ బ్లూ, స్టార్‌ గేజ్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Redmi 14C 5G smartphone

చిప్‌సెట్, OS వివరాలు :
రెడ్‌మి 14c 5G హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS తో పనిచేస్తోంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు.

రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే వివరాలు :
రెడ్‌మి ఫోన్‌ ఎంట్రీ లెవల్‌ ధరలో అందుబాటులోకి వచ్చినా 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV rheinland సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. ఈ ధరలో ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP52 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

కెమెరా వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంటుంది. వెనుక వైపు నైట్‌ మోడ్‌, పొర్ట్రెయిట్‌ మోడ్‌ను కలిగి ఉంది. అదే ముందు వైపు బ్యూటీ మోడ్‌ ను సపోర్టు చేస్తుంది.

ఎంట్రీ లెవల్‌ ధరలో భారీ డిస్‌ప్లే :
రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ 18W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ధరలో ఈ హ్యాండ్‌సెట్ బెస్ట్ ఆప్షన్‌ గా ఉంది. ఎంట్రీ లెవల్‌ ధరలో 5G తోపాటు భారీ బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఈ డిస్‌ప్లే అనుకూలంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Redmi 14C 5G smartphone with 6.88 inch display and 50MP Camera available at RS9999 on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X