రూ.15 వేల ధరలో 7000mAh భారీ బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్!
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్ లో అధిక డిమాండ్ ఉంటుంది. అందువల్ల అనేక స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థలు.. ఈ సెగ్మెంట్ లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల అనేక సంస్థలు భారీ బ్యాటరీలు, భారీ డిస్‌ప్లేలతో బడ్జెట్ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టులో రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ (Redmi 15 5G Smartphone) అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ ధర వివరాలు :
రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం షియోమీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్ లో ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14998, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.15998, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16998 గా ఉంది.

కలర్ వేరియంట్స్ :
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ శాండీ పర్పుల్, ప్రాస్టెడ్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది. IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్బీ సపోర్టును కలిగి ఉంది. రూ.15 వేల ధరలో ఫోన్ కోసం చూస్తుంటే ఈ హ్యాండ్‌సెట్‌ను ఆప్షన్‌గా భావించవచ్చు.
6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే :
రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.9 అంగుళాల FHD+ LCD (1080 x 2340 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 288Hz టచ్ శాంప్లింగ్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. TUV Rheinland సర్టిఫికేషన్ లతో అందుబాటులో ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది. పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ను కలిగి ఉంది. ఇందులో 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్ టు సెర్చ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తోపాటు AI Sky, AI Erase వంటి ఇమేజింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
7000mAh బ్యాటరీ :
ఈ రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 18W రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ IR బ్లాస్టర్, సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








