రూ.14999 ధరకే 6.9 అంగుళాల డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ ఫోన్.. సేల్ ప్రారంభం..!
Redmi 15 5G smartphone Sale is Live : భారత్‌లో ఎంట్రీ, బడ్జెట్ మోడల్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్ల అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఈ ధర సెగ్మెంట్‌లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల రెడ్‌మి సంస్థ బడ్జెట్ రేంజ్‌లో 7000mAh బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ బ్యాటరీతో రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
రూ.14999 ధర :
రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం అయింది. షియోమీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

భారీ బ్యాటరీ :
రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల FHD+ LCD భారీ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 1080 x 2340 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 288Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని సంస్థ హామీ ఇచ్చింది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా (AI), 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ AI Erase, AI Sky, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్స్‌ను కలిగి ఉంది. గూగుల్ సర్కిల్ టూ సెర్చ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్ చార్జింగ్‌తో 23.5 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని తెలిపింది. IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ రెడ్‌మి ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చి ఉంది. మరియు IR బ్లాస్టర్‌ను కూడా కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ సపోర్టును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ శాండీ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








