రూ.15,999 ధరకు 7000mAh బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్!
భారత్ మార్కెట్‌లో రెడ్‌మి నుంచి రెడ్‌మి నోట్ 15 తోపాటు నోట్ 15 ప్రో సిరీస్ విడుదల అయింది. బడ్జెట్, మిడ్‌రేంజ్ ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే గత సంవత్సరం రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.15999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అయితే ఈ ధరలో 7000mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.
రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ (Redmi 15 5G Smartphone) ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.16,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. శాండీ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ రెడ్‌మి ఫోన్ 6.9 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 288Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది. ఈ రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని సంస్థ హామీ ఇచ్చింది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 50MP కెమెరా ఉంది. దీంతోపాటు 2MP లెన్స్ ఉంది. ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా ఉంది. AI Erase, AI Sky, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

7000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్టు :
రెడ్‌మి 5G ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు 18W రివర్స్ వైర్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్, Gemini AI వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్, GPS, వైఫై, GPS, IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్బీ సపోర్టుతో స్వీకర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ సపోర్టును కలిగి ఉంటుంది. మరియు IR బ్లాస్టర్ ను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








