ఈ సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. 6300mAh బ్యాటరీ, 32MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌తో..!
భారత్ లో రెడ్‌మి సంస్థ గత సంవత్సరం ఆగస్టులో రెడ్‌మి 15 5G ఫోన్ ను విడుదల చేసింది. అనంతరం డిసెంబర్ లో అదే సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో రెడ్‌మి 15c 5G మోడల్ ను తీసుకొచ్చింది. త్వరలో ఈ సిరీస్ నుంచి మరో ఫోన్ విడుదల చేస్తామని రెడ్‌మి వెల్లడించింది. విడుదల తేదీ సహా అనేక వివరాలను షేర్ చేసింది.
ఎప్పుడు విడుదల కానుంది :
భారత్ మార్కెట్ లో రెడ్‌మి 15A 5G స్మార్ట్‌ఫోన్ (Redmi 15A 5G Smartphone) మార్చి 27 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ షియోమీ ఇండియా వెబ్‌సైట్ లో ప్రారంభం అయింది. దీని ఆధారంగా ఫోన్ డిజైన్, కలర్ వేరియంట్స్, కెమెరాలు సహా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.

ఫ్లాట్ బ్యాక్ ప్యానల్, వాటర్ డ్రాప్ నాచ్ స్టైల్ :
రెడ్‌మి 15A 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంటుంది. టెక్చర్డ్ ఫినిష్ తో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్స్ లో భారత్ మార్కెట్ లో లభిస్తుంది. ముందు వైపు వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిజైన్ ను కలిగి ఉంటుంది.
కెమెరా మాడ్యుల్ వివరాలు :
ఈ ఫోన్ దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌తోపాటు LED ఫ్లాష్ లైట్ ను కలిగి ఉంటుంది. 32MP AI ప్రైమరీ కెమెరా ఉంటుంది. మిగిలిన కెమెరాల వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
6300mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ 5G చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 6300mAh బ్యాటరీతో లాంచ్ కానుందని తెలిపింది. ఫలితంగా రోజంతా వినియోగించుకోవచ్చని రెడ్‌మి చెబుతోంది. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మి 15c 5G Smartphone :
ఈ సంవత్సరం డిసెంబర్ లో రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13999 గా ఉంది. ఈ ఫోన్ మూన్‌లైట్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, డస్క్ పర్పుల్ కలర్ వేరియంట్స్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని రెడ్‌మి హామీ ఇచ్చింది.
కెమెరా విభాగం పరంగా 50MP AI కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.


Click it and Unblock the Notifications








