Home
Mobile

ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వచ్చేసింది.. డ్యూయల్‌ కెమెరాలు సహా కీలక వివరాలు లీక్‌..!

Redmi 15C 5G Smartphone : రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల గురించి ఇటీవలే కొన్ని లీక్స్‌ వచ్చాయి. అయితే తాజాగా ఈ ఫోన్‌ విడుదల తేదీ సహా ఇతర వివరాలను రెడ్‌మి విడుదల చేసింది. ఈ వివరాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫోన్‌ కు సంబంధించిన వివరాలతో షియోమీ ఇండియా, అమెజాన్ వెబ్‌సైట్‌లలో మైక్రోసైట్స్‌ ప్రారంభం అయ్యాయి. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ఎప్పుడు విడుదల కానుంది? :
రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో డిసెంబర్‌ 3 వ తేదీన విడుదల కానుంది. షియోమీ ఇండియా, అమెజాన్‌లో సేల్‌ ప్రారంభం కానుంది. నవంబర్‌ 28 వ తేదీన ఈ ఫోన్‌ డిజైన్‌ను విడుదల చేస్తామని రెడ్‌మి తెలిపింది. అనంతరం క్రమంగా నవంబర్‌ 30, డిసెంబర్‌ 1, 2 తేదీల్లో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపింది.

Redmi 15C 5G smartphone launch date revealed in india here are the expected specs and features

వెనుక వైపు డ్యూయల్ కెమెరాలు :
ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఈ ఫోన్ వెనుక వైపు దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. రెండు కెమెరాలు ఉంటాయి. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అయితే ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ అంచనా వివరాలు లీక్‌ అయ్యాయి.

అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్‌, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

ఈ రెడ్‌మి ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లపై రెడ్‌మి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ధర వివరాలు :
కొన్ని లీక్స్‌ ఆధారంగా రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499 గా ఉంటుందని తెలుస్తోంది. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ :
ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS పైన పనిచేస్తోంది.

ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 18W వైర్‌ ఛార్జంగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 15C 5G smartphone launch date revealed in india here are the expected specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X