రూ.12499 ధరకు 6000mAh బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP AI కెమెరా 5G ఫోన్!
Redmi 15c 5G Smartphone : రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ సంవత్సరం జనవరిలో రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాగా.. తాజాగా 15c అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ రెడ్‌మి ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్, 50MP కెమెరా సహా అనేక మెరుగైన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల HD+ (720 X 1600 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 810 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు TUV Rheinland Low బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ, సర్కాడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

మీడియాటెక్ ప్రాసెసర్ :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ద్వారా 8GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది.
5 సంవత్సరాల అప్‌డేట్స్, 6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని రెడ్‌మి హామీ ఇచ్చింది. ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్‌తో 50MP AI కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ను కలిగి ఉంది. దీంతోపాటు IR బ్లాస్టర్, ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, IR బ్లాస్టర్,
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499 గా ఉంది.
ఈ ఫోన్ సేల్ డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. షియోమీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ డస్ట్ పర్పుల్, మూన్‌లైట్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








