Home
Mobile

రూ.15 వేల ధరలో లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌.. 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ!

రెడ్‌మి సంస్థ ఇటీవల 200MP కెమెరాతో రెడ్‌మి నోట్ 15 ప్రో సిరీస్ ను తీసుకొచ్చింది. ఈ సిరీస్‌ లో భాగంగా నోట్‌ 15 ప్రో 5G, నోట్‌ 15 ప్రో ప్లస్‌ 5G ఫోన్‌ లు అందుబాటులోకి వచ్చాయి. సేల్ కూడా ప్రారంభం అయింది. గత సంవత్సరం డిసెంబర్‌ లో రెడ్‌మి 15 సిరీస్‌ నుంచి బడ్జెట్ ఫోన్‌ ను తీసుకొచ్చింది. ఈ రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ ఫోన్ 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది.

బడ్జెట్ ధరలో లేటెస్ట్‌ ఫోన్‌ కోసం చూస్తున్న వారికి రెడ్‌మి 15c స్మార్ట్‌ఫోన్‌ (Redmi 15c 5G Smartphone) ఓ ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్‌ లో (Amazon) అందుబాటులో ఉంది. డస్క్ పర్పుల్‌, మిడ్‌ నైట్‌ బ్లాక్‌, మూన్‌ లైట్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

Redmi 15c 5G smartphone

ధర, సేల్ వివరాలు :
అమెజాన్‌ లో ప్రస్తుతం రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను కూడా పొందవచ్చు.

భారీ డిస్‌ప్లే :
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 810 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 33W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Redmi 15c 5G smartphone

మీడియాటెక్ చిప్‌సెట్, 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
రెడ్‌మి ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌ ఉంది. ఇందులో 50MP AI కెమెరా, మరో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 8MP కెమెరా ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, IR బ్లాస్టర్‌, 3.5mm ఆడియో జాక్‌, USB- C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 15c 5G smartphone one of the best phone under 13k, with 50MP camera, 6000mAh battery on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X