రూ.12499 ధరకు 6.9 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ ఫోన్!
రెడ్‌మి నుంచి ఇటీవల రెడ్‌మి 15c 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ చిప్, 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు భారీ బ్యాటరీ సహా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ ( Redmi 15c 5G Smartphone Sale ) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.

కలర్ వేరియంట్స్ :
షియోమీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డస్ట్ పర్పుల్, మూన్‌లైట్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
రెడ్‌మి 15c స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి 15c స్మార్ట్ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 810 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే TUV Rheinland Low బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ, సర్కాడియన్ సర్టిఫికేషన్ లు ఉన్నాయి.
5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS 2 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి స్మార్ట్ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 50MP AI కెమెరా, మరో కెమెరా ఉంది. 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఇ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సర్, యాక్సెలిరోమీటర్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. దీంతోపాటు IR బ్లాస్టర్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications








