Home
Mobile

రెడ్‌మి నుంచి త్వరలో స్మార్ట్‌ఫోన్‌.. కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు లీక్‌..!

రెడ్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌ లో ఈ సంవత్సరం జులై లో రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. అనంతరం ఆగస్టు నెలలో రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్‌ అయింది. త్వరలో మరో ఫోన్‌ విడుదల కానుంది. రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi 15c 5G Smartphone) త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఈ ఫోన్‌ గ్లోబల్ మార్కెట్‌ లో లాంచ్‌ అయింది.

రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులో ఉన్న రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా రెడ్‌మి 15C 5G ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. అయితే రెడ్‌మి సంస్థ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్‌ గురించి అనేక వివరాలు లీక్ అయ్యాయి.

redmi 15c 5G Smartphone

కీలక వివరాలు లీక్! :
రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ వెల్లడించారు. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12499 గా ఉంటుందని అంచనా వేశారు. దీంతోపాటు 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ గా ఉంటుందని అంచనా వేశారు.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేసే అవకాశం ఉంది.

భారీ డిస్‌ప్లే, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని తెలిపారు. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఫ్లాట్‌ బ్యాక్‌ ప్యానల్‌ సహా :
గతంలో లీక్‌ అయిన వివరాల ఆధారంగా రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాట్‌ బ్యాక్ ప్యానల్‌, దీర్ఘచతురస్రాకార కెమెరా ఐలాండ్‌ తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు వెనుక వైపు కెమెరాలతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంటుంది. ముందువైపు సన్నని బెజెల్స్‌, వాటర్ డ్రాప్‌ నాచ్‌ డిజైన్‌ ను కలిగి ఉంటుందని తెలిసింది.

భారత్ మార్కెట్‌ లో ఈ రెడ్‌మి ఫోన్‌ గ్రీన్‌, లావెండర్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ వివరాలపై రెడ్‌మి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
redmi 15c 5G Smartphone specifications leaked in india, could launch soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X