రెడ్‌మి నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. తాజాగా కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు లీక్.. 4 కలర్ వేరియంట్స్..!
భారత్ మార్కెట్‌లో రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం జనవరిలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కొన్ని దేశాల్లో ఆగస్టు 2024 లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా రెడ్‌మి 15c స్మార్ట్‌ఫోన్ (Redmi 15C Smartphone) త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో మింట్ గ్రీన్, మూన్‌లైట్ బ్లూ, మిడ్‌నైట్ గ్రే, ట్విలైట్ ఆరెంజ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది.
డిస్‌ప్లే వివరాలు! :
రెడ్‌మి 15c స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు మీడియాటెక్ హీలియో G81 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని సమాచారం.

6000mAh బ్యాటరీ! :
ఈ హ్యాండ్‌సెట్ షియోమీ HyperOS పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. Epto లిస్టింగ్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఈ ఫోన్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.
50MP AI కెమెరా :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి 15C స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP AI కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చి ఉంటుందని తెలుస్తోంది.
కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 4G LTE, బ్లూటూత్, వైఫై, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 205 గ్రాములు బరువు ఉంటుందని తెలుస్తోంది.
ధర వివరాలు :
రెడ్‌మి 15c స్మార్ట్‌ఫోన్ ఇటలీ సహా యూరోపియన్ లోని కొన్ని మార్కెట్లలో ప్రాంతంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 133.90 (భారత మార్కెట్ ప్రకారం రూ.13400) గా ఉండే అవకాశం ఉంది. అదే 4GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర EUR 154.90 (భారత్ మార్కెట్‌లో రూ.15500) గా ఉంటుందని తెలుస్తోంది. Epto లిస్టింగ్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ వివరాలు :
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS పైన పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
18W వైర్ ఛార్జంగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది. రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.9499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10499, 6GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది.


Click it and Unblock the Notifications








