3 వేరియంట్లలో దిగిన Redmi 5, భారీ ఆఫర్లతో జియో..

చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ గతేడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.

|

చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ గతేడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా ఇందులో యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు లభిస్తున్నాయి. గతంలో విడుదలైన రెడ్‌మీ 4 ను మించిన పవర్‌ఫుల్ ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అలాగే ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం ఇచ్చారు. ఫోన్ బాడీని మెటల్‌తో తయారు చేసినందున ప్రీమియం క్వాలిటీ లుక్ వచ్చింది. ఫోన్ వెన‌క భాగంలో ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. రెడ్‌మీ 4 క‌న్నా 11 శాతం త‌క్కువ‌ స్లిమ్ బాడీని ఈ ఫోన్ క‌లిగి ఉంది.

 

షియోమికి దేశీయ దిగ్గజం సవాల్, Mi TV 4కి పోటీగా స్మార్ట్ టీవీషియోమికి దేశీయ దిగ్గజం సవాల్, Mi TV 4కి పోటీగా స్మార్ట్ టీవీ

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్

రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అయింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్, అమెజాన్ సైట్‌లలో ఈ ఫోన్ ప్రత్యేకంగా లభ్యం కానుంది.

ధర

ధర

కాగా 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 7,999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. రెండో వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌. దీని ధర 10,999 రూపాయలుగా షియోమి తెలిపింది.

100జీబీ అదనపు డేటాతో
 

100జీబీ అదనపు డేటాతో

100జీబీ అదనపు డేటాతో రిలయన్స్‌ జియో నుంచి 2,200 రూపాయల ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ను ఈ ఫోన్‌పై పొందొచ్చు. అమెజాన్‌ ఇండియా, ఎంఐ.కామ్‌లలో 5 శాతం డిస్కౌంట్‌ను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు అందించనుంది. తొలిసారి కిండ్లీ ఈబుక్స్‌ కొనే వారికి 90 శాతం తగ్గింపు లభించనుంది.

 షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.ఫేస్‌ రికగ్నైజేషన్‌, స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌. బ్లాక్‌, గోల్డ్‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటు

షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లు...

షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లు...

ధర రూ.6,999

5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/4 జీబీ ర్యామ్
16/32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
4100 ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్‌మి నోట్‌ 4 స్పెషిఫికేషన్లు..

రెడ్‌మి నోట్‌ 4 స్పెషిఫికేషన్లు..

3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 9,999 రూపాయలు కాగ, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్‌ ధర 11,999 రూపాయలు

5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
2.5 కర్వ్‌డ్‌ గ్లాస్‌
ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ
128జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ బ్యాక్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ
బ్లాక్‌, డార్క్‌ గ్రే, గోల్డ్‌ రంగుల్లో ఇది అందుబాటు

Best Mobiles in India

English summary
Redmi 5 Launched in India in 3 Variants, Price Starts at Rs. 7,999: Event Highlights More News at Gizbt Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X