మొబైల్ రంగంలో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఇండియాలో ఈ ఏడాది మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రేమికుల రోజు దినోత్సవమైన February 14న గ్రాండ్ ఈవెంట్ తో తన సత్తాను చాటబోతోంది. తన 2018 తొలి ప్రొడక్ట్‌ను భారత్‌లో లాంచ్ చేయబోతుంది. దీని కోసం కంపెనీ బిగ్ ''5'' లోగోతో ఆహ్వానాలు కూడా పంపుతోంది.ఈ ఆహ్వాన పత్రికల మేరకు షియోమి తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 5నే భారత్‌లో లాంచ్ చేస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఫిబ్రవరి 14న జరగనున్న ఈ ఈవెంట్లో రెడ్‌మి 5 ప్లస్ కూడా వస్తుందో లేదో ఇంకా స్పష్టతలేదు.
బెస్ట్ EMI ఆఫర్స్‌లో లభిస్తున్న టాప్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
రెడ్‌మి 5 , రెడ్‌మి 5 ప్లస్..
చైనాలో గత డిసెంబర్లో రెడ్‌మి 5 , రెడ్‌మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. 2జీబీ ర్యామ్ / 16జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్ / 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ / 32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రెడ్‌మి 5 ఫోన్ అక్కడ లాంచ్ అయింది. ఈ ఫోన్లను ఈ ఏడాది ఇండియా మార్కెట్లోకి తీసుకు రాబోతోంది.
బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల వేరియంట్లలో..
బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల వేరియంట్లలో అక్కడ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన రెడ్‌మి 5 ధర అక్కడ 799 సీఎన్‌వై నుంచి అంటే రూ.8100గా ప్రారంభం కాగ, రెడ్‌మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ సీఎన్‌వై 999(రూ.10,200) నుంచి ప్రారంభమైంది.
రెడ్‌మి 5స్పెషిఫికేషన్లు
డ్యూయల్-సిమ్
ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారితంగా ఎంఐయూఐ 9తో రన్
5.7 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్‌ఓసీ
2జీబీ/ 3జీబీ / 4జీబీ ర్యామ్
16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
4G VoLTE, Wi-Fi, Bluetooth 4.2,
GPS, a 3.5mm headphone jack, Micro-USB
రెడ్‌మి 5ప్లస్ స్పెషిఫికేషన్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్‌ఓసీ
3జీబీ/ 4జీబీ ర్యామ్
32జీబీ/ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్-సిమ్
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
4G VoLTE, Wi-Fi, Bluetooth 4.2,
GPS, a 3.5mm headphone jack, Micro-USB
రెడ్‌మి 5 మొబైల్ ధర
కానీ భారత్‌లో ఈ ఫోన్ ధర ఏ మేర ఉంటుందో ఇంకా తెలియలేదు. అంచనాల ప్రకారం రెడ్‌మి 5 మొబైల్ 2 జిబి ర్యామ్ ధర రూ. 8,100గానూ, 3 జిబి ర్యామ్ ధర రూ. 9,100గానూ, 4 జిబి ర్యామ్ ధర రూ. 11,200గానూ ఉండే అవకాశం ఉంది.
రెడ్‌మి 5 ప్లస్ మొబైల్ ధర
అలాగే రెడ్‌మి 5 ప్లస్ మొబైల్ 3 జిబి ర్యామ్ ధర రూ. 10,200గానూ, 4 జిబి ర్యామ్ ధర రూ. 13,200గానూ ఉండే అవకాశం ఉంది. అయితే కరెక్ట్ ధర ఎంత ఉంటుదనేది లాంచింగ్ రోజు మాత్రమే తెలుస్తుంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.