Just In
Don't Miss
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- News
బెంగాల్లో ఐదు రైళ్లకు నిప్పు పెట్టిన నిరసన కారులు...!
- Finance
నేటి నుంచి FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
రెడ్మి 8 స్పెసిఫికేషన్స్ అదుర్స్..... ధర కూడా తక్కువ
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఈ రోజు తన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి 8ను ఇండియాలో విడుదల చేసింది. రెడ్మి 7కు అప్డేట్ వెర్షన్ గా వచ్చిన రెడ్మి 8 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 12 నుండి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రెడ్మి 8 తో షియోమి సంస్థ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ మరియు కెమెరా యొక్క రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించింది.

షియోమి ఇండియా MD అనుజ్ శర్మ రెడ్మి 8 లాంచ్ షోను ప్రారంబించారు. గత వారం ముగిసిన Mi దీపావళి సేల్‌తో కంపెనీ గురించి మాట్లాడటంతో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అమ్మకం సమయంలో షియోమి 5.3 మిలియన్ డివైస్ లను విక్రయించినట్లు శర్మ వెల్లడించారు. ఈ 5.3 మిలియన్ పరికరాలలో 3.8 మిలియన్లు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి అని తెలిపారు.
Mi దీపావళి సేల్ : ఫోన్లు,టీవీలపై ఆఫర్లే ఆఫర్లు

తరువాత శర్మ రెడ్మి 8 యొక్క అన్ని వివరాలను వెల్లడించారు. దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వస్తుంది. ఈ కెమెరా సెటప్‌లో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 1.4 మైక్రో పిక్సెల్ సైజు, ఎఫ్ / 1.8 ఎపర్చరు మరియు సోనీ IMX363 ఇమేజ్ సెన్సార్ తో ఉంటుంది. రెండవ కెమెరా షూటర్ పోర్ట్రెయిట్లకు సహాయపడటానికి 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ తో వస్తుంది. ఇతర కెమెరా లక్షణాలలో AI డిటెక్షన్ మరియు గూగుల్ లెన్స్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఆసుస్ స్మార్ట్ ఫోన్ లపై రూ.7000 వరకు డిస్కౌంట్

ఇతర స్పెసిఫికేషన్లలో రెడ్మి 8 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్ ను అందించడానికి రెడ్మి 8 అనేక AI బ్యాటరీ మెరుగుదలలతో వస్తుందని శర్మ పేర్కొన్నారు. ఇది USB టైప్-సి పోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. డిజైన్ విభాగంలో రెడ్మి 8 స్మార్ట్‌ఫోన్ షియోమి యొక్క స్పోర్ట్స్ ఆరా మిర్రర్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది బ్లూ, రూబీ రెడ్ మరియు ఒనిక్స్ బ్లాక్ వంటి కలర్ లలో అందించబడుతుంది.

రెడ్మి 8 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC చేత శక్తిని కలిగి ఉండి 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. దీని ఇంటర్నల్ స్టోరేజ్ 64GB వరకు ఉందని శర్మ వెల్లడించారు. అదనంగా రెడ్మి 8 లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ మరియు అంకితమైన మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. ముందు భాగంలో గొరిల్లా గ్లాస్ 5, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

తరువాత మను కుమార్ జైన్ వేదికపైకి వచ్చి రెడ్మి 8 స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను వెల్లడించాడు. రెడ్మి 8 స్మార్ట్‌ఫోన్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో అందించనున్నారు. ఇందులో 3 జీబీ ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.7,999 కాగా, 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 8,999 రూపాయలు. ఇండియాలో 100 మిలియన్ల షియోమి స్మార్ట్‌ఫోన్ సేల్స్ జరిగిన సందర్బంగా రెడ్మి 8 యొక్క మొదటి 5 మిలియన్ ఆర్డర్లలో 3 జీబీ ర్యామ్ వేరియంట్ తో సహా 4 జీబీ ర్యామ్ వేరియంట్‌ను కూడా కంపెనీ కేవలం రూ.7,999 లకు అందించనున్నది.

రెడ్మి 8 స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకం అక్టోబర్ 12 న ఉదయం 00:01 గంటలకు Mi.కామ్, ఫ్లిప్‌కార్ట్, మరియు Mi హోమ్ స్టోర్స్ ద్వారా జరుగనున్నాయి. షియోమి తన 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ను కూడా అక్టోబర్ 16 న దేశంలో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790