Redmi 9 Prime Sale: 10వేల లోపు ధరలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ సేల్ నేడే!!

|

ఇండియాలో బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ షియోమి సంస్థ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో అధిక శాతంను ఆక్రమించుకున్నది. బడ్జెట్ ధర పరంపరను కొనసాగిస్తూ షియోమి గత నెలలో రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సరఫరా వంటి ఇతర కారణాల ద్వారా పరిమిత రోజులలో మాత్రమే అమ్మకానికి అందుబాటులోకి వచ్చే ఈ ఫోన్ యొక్క అమ్మకాలు నేడు ఇండియాలో అమెజాన్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ ద్వారా మధ్యాహ్నం 12PM గంటల నుండి మొదలుకానున్నాయి. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో G80 SoC, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌, మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.9,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క‌ ధర రూ.11,999. ఈ రెండు మోడల్స్ స్పేస్ బ్లూ, మింట్ గ్రీన్, మాట్టే బ్లాక్ మరియు సన్‌రైజ్ ఫ్లేర్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

రెడ్‌మి 9 ప్రైమ్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్  
 

రెడ్‌మి 9 ప్రైమ్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్  

డ్యూయల్ సిమ్ నానో స్లాట్ కలిగిన రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను 19.5: 9 కారక నిష్పత్తితో మరియు 394ppi పిక్సెల్ డెన్సిటీతో  400 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇది ఆరా 360 డిజైన్ మరియు అలల ఆకృతిని కలిగి ఉండి 3D యూనిబోడీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ మరియు మాలి-G52 GPU మద్దతుతో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్‌ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు.

Also Read:2వేల లోపు ధరలో ఫీచర్ ఫోన్ ను విడుదల చేసిన Lava కంపెనీAlso Read:2వేల లోపు ధరలో ఫీచర్ ఫోన్ ను విడుదల చేసిన Lava కంపెనీ

రెడ్‌మి 9 ప్రైమ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 ప్రైమ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 ప్రైమ్‌ స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరాల విషయానికి వస్తే దీని వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 ఎపర్చరుతో 13మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా మరియు ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో  2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి 9 ప్రైమ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లు

రెడ్‌మి 9 ప్రైమ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లు

రెడ్‌మి 9 ప్రైమ్‌ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఫోన్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 a / b / g / n / ac, బ్లూటూత్ 5.0, వై-ఫై డైరెక్ట్, FM రేడియో, NFC, GPS, AGPS మరియు ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లకు మద్దతు ఇస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంది. అలాగే 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ కూడా ఉన్నాయి. 

Best Mobiles in India

Read more about:
English summary
Redmi 9 Prime 2nd Sale Starts Today in India at 12PM via Amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X