Redmi 9 Prime: బడ్జెట్ ధరలో మరొక కొత్త ఫోన్!! ప్రైమ్ డే 2020లో అమ్మకాలు

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమి ఇండియాలో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 9 ప్రైమ్‌ను సరసమైన ధర వద్ద విడుదల చేసారు. బడ్జెట్ ధరలో రియల్‌మి నార్జో 10, శామ్‌సంగ్ గెలాక్సీ M11లకు పోటీగా ఉన్న ఈ ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉండి మీడియాటెక్ హెలియో G80 SoC ద్వారా రన్ అవుతుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌, మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 9 ప్రైమ్ ధరల వివరాలు

రెడ్‌మి 9 ప్రైమ్ ధరల వివరాలు

ఇండియాలో షియోమి సంస్థ రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.9,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్‌ యొక్క ధర రూ.11,999. ఈ రెండు మోడల్స్ స్పేస్ బ్లూ, మింట్ గ్రీన్, మాట్టే బ్లాక్ మరియు సన్‌రైజ్ ఫ్లేర్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

ఇండియాలో రెడ్‌మి 9 ప్రైమ్ సేల్ డేట్

ఇండియాలో రెడ్‌మి 9 ప్రైమ్ సేల్ డేట్

అమెజాన్ ప్రైమ్ డే 2020 అమ్మకంలో భాగంగా ఆగస్టు 6 నుండి అమెజాన్ ద్వారా ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదలుకానున్నాయి. ఇది త్వరలోనే mi.com, Mi హోమ్ స్టోర్స్ మరియు షియోమి భాగస్వామి రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 9 ప్రైమ్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ షియోమి యొక్క కొత్త రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను 19.5: 9 కారక నిష్పత్తితో మరియు 394ppi పిక్సెల్ డెన్సిటీతో 400 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇది ఆరా 360 డిజైన్ మరియు అలల ఆకృతిని కలిగి ఉండి 3D యూనిబోడీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ మరియు మాలి-G52 GPU మద్దతుతో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్‌ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు.

రెడ్‌మి 9 ప్రైమ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 ప్రైమ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్

Redmi 9 ప్రైమ్‌ స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 ఎపర్చరుతో 13మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా మరియు ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి 9 ప్రైమ్ 5,020mAh బ్యాటరీ

రెడ్‌మి 9 ప్రైమ్ 5,020mAh బ్యాటరీ

షియోమి యొక్క కొత్త రెడ్‌మి ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. కానీ ఇది 10W ఛార్జర్‌తో మాత్రమే బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 a / b / g / n / ac, బ్లూటూత్ 5.0, వై-ఫై డైరెక్ట్, FM రేడియో, NFC, GPS, AGPS మరియు ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లకు మద్దతు ఇస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంది. అలాగే 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ కూడా ఉన్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi 9 Prime Released in Indai for Rs.9999

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X