భారత్‌లో Redmi A2 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు విడుదల..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన కొత్త సీరిస్ Redmi A2 ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. ఈ Redmi A2 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు గత సంవత్సరం విడుదలైన Redmi A1కు కొనసాగింపుగా లాంచ్ చేశారు. ఈ సీరిస్ కింద Redmi A2 మరియు Redmi A2+ ఫోన్లు విడుదల చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్లు మే 23 నుంచి అమెజాన్, mi.com, mi హోమ్స్‌లో ప్రారంభ ధర రూ. 5999కు అందుబాటులో ఉంటాయి.
Redmi A2 సీరిస్ స్మార్ట్‌ఫోన‌్లు ఆక్టాకోర్ హీలియో G36 ప్రోసెసర్‌ను కలిగి ఉంటాయి. మరియు 6.52 అంగుళాల హెచ్‌డీ+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్లు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 10W ఛార్జర్‌తో వస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు వెనుకవైపు 8MP డ్యూయల్ కెమెరాలు, ముందువైపు 5MP కెమెరాను కలిగి ఉంటాయి.

రెడ్‌మీ A2 సీరిస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తాయి. మరియు వేగవంతమైన ప్రోసెసింగ్, మల్టీ టాస్కింగ్ కోసం 7GB అదనపు వర్చువల్ ర్యామ్ మద్దతుతో లభిస్తుంది.
రెడ్‌మీ A సీరిస్ స్మార్ట్‌ఫోన్లు ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లు సీ గ్రీన్, అక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్, రంగుల్లో అందుబాటులో ఉంటాయి. మరియు రెడ్‌మీ A2+ ఫోన్ వెనుకవైపు అధునాతన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్లు "రెడ్‌మీ కా డబుల్ భరోసా" కింద రెండు సంవత్సరాలు వారంటీని కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications








