ధర రూ.7299 కే 6.71 అంగుళాల భారీ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
రెడ్‌మి నుంచి A సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. ఈ రెడ్‌మి A3 ( Redmi A3 Smartphone ) తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.71 HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మిడ్‌నైట్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ మరియు లేక్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మరియు వెనుక గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
రెడ్‌మి A3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు : రెడ్‌మి A3 హ్యాండ్‌సెట్ 6.71 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్‌తోపాటు 720*1612 పిక్సల్ రిజల్యూషన్ మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది. మరియు ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.

5000mAh బ్యాటరీ సహా : ఈ రెడ్‌మి కొత్త స్మార్ట్ ఫోన్ అండర్ ది హుడ్ మీడియాటెక్ హీలియో G36 చిప్ తోపాటు PowerVR GE8320 పైన పనిచేస్తుంది. మరియు రెడ్‌మి A3 హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది. 10W వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
రెడ్‌మి A3 స్మార్ట్ ఫోన్ కెమెరాలు : కెమెరాల పరంగా ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 13MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా HDR సపోర్టుతో వస్తుంది. మరియు వెనుకవైపు డ్యూయల్ LED ప్లాష్ లైట్‌తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ రెడ్‌మి కొత్త హ్యాండ్‌సెట్ GPS, బ్లూటూత్ 5.0, GLONASS, Galileo, బీడీఎస్ వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

రెడ్‌మి A3 స్మార్ట్ ఫోన్ ధర : ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 3GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.7299గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.9299 గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ( Flipkart ) మరియు ఎంపిక చేసిన రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మి A3 స్మార్ట్ ఫోన్ సేల్ తేదీ : అలాగే ఈ రెడ్‌మి A3 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 23 నుంచి భారత్‌లో కొనుగోలుకు ( Redmi A3 Smartphone Sale ) అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మిడ్‌నైట్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ మరియు బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








