6.71 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
రెడ్‌మి నుంచి A సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి A3X (Redmi A3X Smartphone Launched) భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ భారీ డిస్‌ప్లే సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్టైలిష్ గ్లాస్ డిజైన్‌తో లాంచ్ అయింది. దీంతోపాటు అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.
రెడ్‌మి A3X స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి A3X స్మార్ట్‌ఫోన్ 6.71 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1650*720 పిక్సల్ రిజల్యూషన్ సహా 90Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ అయింది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది.

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆక్టాకోర్ Unisoc T603 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. Mali G57 MP1 GPU తో జతచేయబడి ఉంటుంది. LPDDR4X ర్యామ్, eMMC 5.1 అంతర్గత స్టోరేజీ తో అందుబాటులోకి వస్తుంది. 3GB మరియు 4GB ర్యామ్ వేరియంట్‌లు, 64GB మరియు 128GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీ పెంచుకొనేందుకు అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ రెడ్‌మి A3X స్మార్ట్‌ఫోన్ f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు QVGA సెకండరీ కెమెరాను కలిగి ఉంది. వెలుగులో మెరుగైన ఫోటోలకు క్యాప్చర్ చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కలిగి ఉంది.
ఈ రెడ్‌మి A3X స్మార్ట్ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్ ఛార్జింగ్ తో రోజంతా వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.0, GPS+ GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ నానో సిమ్ కార్డులు సహా మైక్రో SD కార్డు స్లాట్‌లను కలిగి ఉంటుంది. FM రేడియో సహా 3.5mm ఆడియో జాక్ ఉంటుంది.
ఈ రెడ్‌మి A3X స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్ మరియు ఆరోరా గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో ఈ వివరాలు సహా సేల్ తేదీ, ఆఫర్ల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








