Home
Mobile

భారత్‌ మార్కెట్‌లోకి రెడ్‌మి A3X స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, లాంచ్‌ పూర్తి వివరాలు..!

రెడ్‌మి సంస్థ నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ రెడ్‌మి A3X (Redmi A3x Smartphone) విడుదల కానుంది. భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ఈ హ్యాండ్‌ సెట్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపైన రెడ్‌మి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ఫోన్‌ రెడ్‌మి A3 రీ బ్రాండెడ్‌ వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది.

ఏప్రిల్ నెలలోనే విడుదల కానుంది..!
ఈ ఫోన్‌ 24048RN6CG మరియు 24048RN6CI మోడల్‌ నంబర్ల ద్వారా కనిపించింది. దీని ఆధారంగా ఈ మోడల్‌ ఏప్రిల్‌ నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. మరియు మోడల్ నంబర్‌ లోని G, I అక్షరాలు ద్వారా.. గ్లోబల్ మరియు ఇండియాలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ రెడ్‌మి A3 తరహా ఫీచర్లను కలిగి ఉండనుందని తెలుస్తోంది.

Redmi A3x Smartphone to launch in india soon details

రెడ్‌మి A3 స్మార్ట్‌ ఫోన్‌ తరహా ఫీచర్లు :
రెడ్‌మి A3 స్మార్ట్‌ ఫోన్‌ 1600*700 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ రక్షణతో వచ్చింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌ నైట్‌ బ్లాక్‌, లేక్‌ బ్లూ, ఓలివ్‌ గ్రీన్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

మూడు వేరియంట్లు :
ఈ రెడ్‌మి A3 స్మార్ట్‌ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో G36 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. భారత్‌ మార్కెట్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 3GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ, 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్లలో ఉంది.

రెడ్‌మి A3 స్మార్ట్‌ ఫోన్‌ ధర :
3GB ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.7299 గా ఉంది. అదే 4GB ర్యామ్ ధర రూ.8,299 మరియు 6GB ర్యామ్‌ వేరియంట్ ధర రూ.9299 గా ఉంది. అయితే రెడ్‌మి A3x స్మార్ట్‌ ఫోన్‌ కూడా చాలావరకు ఇదే తరహా స్పెసిఫికేషన్లు కలిగి ఉండే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మోడల్ నంబర్ల ఆధారంగా ఈ రెడ్‌మి A3X కొత్త హ్యాండ్‌ సెట్‌ ఈ నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. మరియు గ్లోబల్‌ మార్కెట్‌లతో పాటు భారత్‌లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సహా లాంచ్‌, సేల్‌ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Redmi A3x Smartphone to launch in india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X