Home
Mobile

ధర రూ.10000 కంటే తక్కువ ధరకే 50MP కెమెరా, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే 5G ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి..!

ఇటీవల జరిగిన ఇండియన్‌ మైబైల్‌ కాంగ్రెస్‌ సదస్సు లో (IMC 2024) షియోమీ సంస్థ రెడ్‌మి A4 5G హ్యాండ్‌సెట్‌ ను ప్రదర్శించింది. కేవలం రూ.10,000 కంటే తక్కువ ధరకే భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. దీంతోపాటు స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌ తో లాంచ్‌ కానున్న తొలి ఎంట్రీ లెవల్‌ హ్యాండ్‌సెట్‌ ఇదేనని తెలిపింది. అయితే ఇటీవల ఈ హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ల వివరాలను లీక్‌ అయ్యాయి. తాజాగా రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi A4 5G Smartphone Launch Date) విడుదల తేదీని సంస్థ అధికారికంగా వెల్లడించింది.

రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ల్యాండింగ్‌ పేజీ లైవ్‌లో ఉంది. ఈ పేజీ ద్వారా ఈ రెడ్‌మి ఎంట్రీలెవల్‌ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఒకే స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే విడుదల కానుందని తెలుస్తోంది.

Redmi A4 5G Smartphone launch date in india

ఎప్పుడు విడుదల కానుంది..? :
రెడ్‌మి ఇండియా అధికారిక X (ట్విట్టర్‌) పేజీ ఆధారంగా A4 5G స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 20న తేదీన భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం Halo గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. అయితే ఎన్ని రంగుల్లో లభిస్తుందో తెలియలేదు.

రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ IPS LCD భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు షియోమీ సంస్థ ఇప్పటికే వెల్లడించినట్లుగా స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS 1.0 తో పనిచేస్తుందని సమాచారం.

5160mAh బ్యాటరీతో :
అయితే ఈ రెడ్‌మి కొత్త హ్యాండ్‌సెట్ కేవలం ఒకే స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ పరంగా మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. USB-C ఛార్టింగ్‌ పోర్టుతో అందుబాటులోకి రానుంది.

50MP కెమెరా ;
కెమెరా విభాగం పరంగా ఈ రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP కెమెరాను కలిగి ఉంటుంది. మరో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్ 8MP కెమెరాను అమర్చినట్లు ఉంటుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలిపింది.

Redmi A4 5G Smartphone launch date in india

రూ.10,000 కంటే తక్కువ ధరకే..! :
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రదర్శన సమయంలోనే రూ.10000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ తెలిపింది. అయితే కచ్చితంగా ఎంత ధరకు విడుదల కానుందనే వివరాలను వెల్లడించలేదు. దీంతోపాటు ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X