ధర రూ.8,499 కే 6.88 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. సేల్ ఎప్పుడంటే?
భారత్ మార్కెట్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ (Redmi A4 5G Smartphone Launched) ఎట్టకేలకు విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2024 సదస్సులో ఆవిష్కరించారు. ఆ సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో తాజాగా విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.8499 గా ఉంది. మరియు 50MP కెమెరాను కలిగి ఉంది. ఎంట్రీలెవల్ ధరలో స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ కలిగిన తొలి 5G స్మార్ట్‌ఫోన్ ఇదేనని సంస్థ ఆవిష్కరణ సమయంలో వెల్లడించింది.
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్ ఫోన్ (Redmi A4 5G Smartphone specifications) భారీ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 720*1640 పిక్సల్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

రెడ్‌మి A4 5G స్మార్ట్ ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS తో పనిచేస్తుంది. ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్ రెండు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్ లను పొందుతుందని సంస్థ వెల్లడించింది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. f/1.8 అపేచర్ తో 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాను అమర్చారు. అదే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 5MP సెల్ఫీ కెమెరాతో విడుదల అయింది. 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై 5, బ్లూటూత్ 5.0, GPS, USB-C వంటి ఫీచర్లను కలిగి ఉంది. IP52 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ బరువు 212.35 గ్రాములు ఉంది.
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,499 గా ఉంది. సంస్థ వెబ్‌సైట్ ద్వారా నవంబర్ 27 నుంచి భారత్‌లో అందుబాటులో ఉంటుంది. స్టార్రీ బ్లాక్, స్పార్కల్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications