రూ.9999 కే 6GB ర్యామ్, 128GB స్టోరేజీ, 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్..!
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం చివర్లో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఎంట్రీ లెవల్ ధరలో లాంచ్ అయింది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. మరియు ఎంట్రీ లెవల్ ధరలో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గ్లాస్ బ్యా్‌క్ డిజైన్, భారీ డిస్‌ప్లే, 50MP కెమెరా సహా అనేక ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ విడుదల సమయంలో రెండు స్టోరేజీ వేరియంట్స్‌లోనే ఉంది. ప్రస్తుతం మరో స్టోరేజీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ కొత్త వేరియంట్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
విడుదల సమయంలో రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లోనే లాంచ్ చేసింది. కొత్తగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను (Redmi A4 5G Smartphone 6GB RAM Variant) తీసుకొచ్చింది. ధర రూ.9999 గా ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ 4GB/64GB వేరియంట్ రూ.8499 కే విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.7999 గా ఉంది. అదే 4GB/128GB వేరియంట్ రూ.9499 కి విడుదల అయింది. ప్రస్తుతం రూ.8799 కే సొంతం చేసుకోవచ్చు. రూ.10 వేల ధరలో 5G ఫోన్ కోసం చూసే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
రెడ్‌మి A4 5G ఫోన్.. 6.88 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంది. మరియు డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్ స్టార్రీ బ్లాక్, స్పార్కల్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ జియో 5G ను సపోర్టు చేస్తుంది. మరియు 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.0, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications