Home
Mobile

రూ.7999 కే 50MP కెమెరా, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5160mAh బ్యాటరీతో 5G ఫోన్‌..!!

భారత మార్కెట్‌లో గత సంవత్సరం రెడ్‌మి నుంచి ఎంట్రీ లెవల్‌ ధరలో 5G ఫోన్‌ లాంచ్‌ అయింది. రూ.8499 ధరకు 5G సపోర్టుతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ఫోన్ వెనుక వైపు గ్లాస్ ప్యానల్‌ను కలిగి ఉంది. మరియు భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి A4 5G ఫోన్‌ (Redmi A4 5G Smartphone) భారత్‌లో విడుదల సమయంలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499 గా ఉండేది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499 గా ఉండేది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ రెండు వేరియంట్స్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Redmi A4 5G smartphone

రూ.7999 ధరకే :
అమెజాన్‌లో 64GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.7999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.8798 కే సొంతం చేసుకోవచ్చు. ఈ రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ స్టారీ బ్లాక్‌, స్పార్కల్‌ పర్పుల్‌ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

రెడ్‌మి A4 5G స్మా్ర్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 4GB LPDDR4x ర్యామ్‌, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hyper OS ను కలిగి ఉంది.

4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ LCD భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్‌లో భారీ డిస్‌ప్లే ఫోన్‌ కోసం చూస్తున్న వారికీ ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.

5160mAh బ్యాటరీ :
ఈ రెడ్‌మి A4 5G హ్యాండ్‌సెట్‌ 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే కెమెరా పరంగానూ బెస్ట్‌ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP కెమెరాతోపాటు మరో లెన్స్‌ను అమర్చారు. 5MP సెల్ఫీ కెమెరాతో కలిగి ఉంది.

ఈ రెడ్‌మి ఫోన్ IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. అయితే కనెక్టివిటీ పరంగా 5G (SA), 4G, బ్లూటూత్‌ 5.0, వైఫై 5, GPS వంటి ఫీచర్‌లు ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

ప్రస్తుతం రూ.10000 కంటే తక్కువ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే భారీ డిస్‌ప్లే, 5G (SA), ఆకట్టుకొనే డిజైన్‌, 50MP కెమెరా వంటి స్పెసిఫికేషన్‌లు కలిగిన ఫోన్‌ కోసం చూస్తున్నట్లు అయితే రెడ్‌మి A4 5G ఫోన్‌ వైపు మొగ్గు చూపువచ్చు.

Best Mobiles in India

English summary
Redmi A4 5G smartphone now available at Rs7999 on amazon 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X