ధర రూ.8499 ధరకు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ 5G ఫోన్..? పూర్తి వివరాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) సదస్సులో రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ (Redmi A4 5G Smartphone) ఆవిష్కరించింది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీంతోపాటు స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌తో విడుదల చేస్తామని పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.10,000 కంటే తక్కువ ధరను కలిగి ఉంటుందని తెలిపింది. అయితే ఈ ధరలో స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌తో లాంచ్ కానున్న తొలి ఫోన్ రెడ్‌మి A4 5G మాత్రమేనని సంస్థ తెలిపింది.
IMC 2024 సదస్సులో ఈ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించిన సమయంలో ఎటువంటి చిప్‌సెట్ వివరాలు మినహా ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే తాజాగా కొన్ని నివేదికలు ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను అంచనా వేశాయి. ఈ సంవత్సరం చివర్లో ఈ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది.

రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ అంచనా ధర :
Smartprix నివేదిక ఆధారంగా రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ (Redmi A4 5G Smartphone Leaked Price) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499 గా ఉంటుందని తెలుస్తోంది. ప్రారంభ ఆఫర్, బ్యాంకు ఆఫర్లతో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
కొన్ని నివేదికల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 4nm స్మార్ట్‌డ్రాగన్ 4s జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సంస్థ ఇప్పటికే వెల్లడించింది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS 1.0 Skin తో పనిచేస్తుందని తెలుస్తోంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది.
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ :
దీంతోపాటు భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ సింగిల్ స్పీకర్, బ్లూటూత్, వైఫై 5, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటుపాటు స్టోరేజీ వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








