ధర రూ.8,499 కే 50MP కెమెరా, 6.88 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్ లో ఇటీవల విడుదల అయిన రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌తో లాంచ్ అయిన తొలి ఎంట్రీ లెవల్ 5G ఫోన్ అని షియోమీ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ భారీ డిస్‌ప్లే సహా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు రూ.8499 కే అందుబాటులో (Redmi A4 5G Smartphone Sale) ఉంది. గ్లాస్ బ్యాక్ ప్యానల్ సహా అనేక ఆకట్టుకొనే ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర, సేల్, స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌ల వివరాలు.
రెడ్‌మి A4 5G స్మా్ర్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రెడ్‌మి A4 5G స్మా్ర్ట్‌ఫోన్ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్‌ల లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,499 గా ఉంది. స్టారీ బ్లాక్, స్పార్కల్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

తక్కువ ధర.. ఆకట్టుకొనే ఫీచర్‌లు..! :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ షియోమీ ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్, mi.com, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను తొలిసారిగా ఈ సంవత్సరంలో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2024 సదస్సు ఆవిష్కరించారు. అయితే ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చినా.. మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది.
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రెడ్‌మి A4 5G హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.88 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది.
4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్ లు. 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్ లను పొందుతుందని షియోమీ తెలిపింది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
50MP కెమెరా, 5160mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి A4 స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఈ 5G స్మా్ర్ట్‌ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ రెడ్‌మి 5G స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.0, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








