ధర రూ.10,000 కంటే తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌తో తొలి 5G స్మార్ట్‌ఫోన్..!
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 (India Mobile Congress 2024) సదస్సులో రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ ఆవిష్కరించింది. రూ.10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ కలిగిన తొలి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మి A4 5G నిలుస్తుందని సంస్థ తెలిపింది. త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి ఈ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేస్తామని రెడ్‌మి వెల్లడించింది. అయితే కచ్చితమైన విడుదల తేదీని సంస్థ వెల్లడించలేదు.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు 2024 లో రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ (Redmi A4 5G Smartphone Unveiled) ను బ్లాక్ మరియు వైట్ రంగుల్లో ప్రదర్శించింది. 4nm స్నా్ప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ తో పనిచేస్తుందని సంస్థ తెలిపింది. ఈ ప్రాసెసర్ LPDDR4x ర్యామ్ ను సపోర్టు చేస్తుంది. అయితే మిగిలిన వివరాలపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే ప్రాసెసర్ ఆధారంగా ఈ రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలను అంచనా వేశారు. ఈ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో పుల్ HD+ డిస్‌ప్లేను సపోర్టు చేస్తుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రదర్శించిన హ్యాండ్‌సెట్‌ల ఆధారంగా భారీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
కెమెరా మాడ్యూల్ :
మరియు క్వాల్‌కామ్ డాక్యుమెంటేషన్ ఆధారంగా ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ 13MP కెమెరాలు లేదా 25MP కెమెరాను సపోర్టు చేస్తుంది. ఈ కెమెరాలు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. అయితే ఈ సదస్సులో ప్రదర్శించిన రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌తో డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది.

కనెక్టివిటీ ఫీచర్‌లు :
ఈ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 5, బ్లూటూత్ 5.1, NFC కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. మరియు ఈ ప్రాసెసర్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS మరియు NavIC శాటిలైట్ సిస్టమ్స్‌ను సపోర్టు చేస్తుంది. మరియు UFS 3.1 స్టోరేజీ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3.5mm ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం చివర్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌తో మెరుగైన పనితీరు సహా, సామర్థ్యం, 5G కనెక్టివిటీ మరింత విస్తృతం అవుతుందని భావించవచ్చు. స్నాప్‌డ్రాగన్ AI సామర్థ్యం మరియు షియోమీ మార్కెట్ తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Image Source : @ishanagarwal24


Click it and Unblock the Notifications








