రూ.6499 ధరకే 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. రేపటి నుంచే సేల్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ లు, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ షియోమీ నుంచి భారత్ మార్కెట్ లోకి ఇవాళ రెడ్‌మి A5 స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు మెరుగైన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. 5200mAh బ్యాటరీతోపాటు 6.88 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో ఇదే తరహా డిస్‌ప్లే కలిగి ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి.
రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ (Redmi A5 Smartphone Launched) 8.26mm థిక్‌నెస్ తో ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 6.88 అంగుళాల ( 1640*720 పిక్సల్స్ ) HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది.

రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తో Unisoc T7250 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4x ర్యామ్, 128GB eMMC 5.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు Mali G57 GPU చిప్‌సెట్ ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Go Edition OS తో పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వెపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 32MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో లెన్స్‌ను అమర్చారు. నైట్ మోడ్, అల్ట్రా HD, టైం ల్యాప్స్, పొర్ట్రెయిట్ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ రెడ్‌మి ఎంట్రీ లెవల్ ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌తోపాటు ఛార్జర్‌ను కూడా ఉచితంగా అందించనున్నారు. మరియు IP52 రేటింగ్ తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ జస్ట్ బ్లాక్, జైసల్మీర్ గోల్డ్, పాండిచ్చేరీ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్. USB-C ను కలిగి ఉంది. భద్రత కోసం AI ఆధారిత ఫేస్ అన్‌లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ హ్యాండ్‌సెట్ TUV Rheinland సర్టిఫికేషన్ ను కలిగి ఉంది.

రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,499 గా ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది. షియోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా రేపు (ఏప్రిల్ 16) మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








