Home
Mobile

షియోమి దీపావళి గిఫ్ట్ : రూ.1కే స్మార్ట్‌ఫోన్..

చైనా మొబైల్ దిగ్గజం షియోమి వినియోగదారులను ఆకట్టకునే లక్ష్యంతో భారీ ఆఫర్లకు తెరలేపింది.

By Hazarath

చైనా మొబైల్ దిగ్గజం షియోమి వినియోగదారులను ఆకట్టకునే లక్ష్యంతో భారీ ఆఫర్లకు తెరలేపింది. రానున్న దీపావళి పర్వదినాన్నిపురస్కరించుకుని రూపాయికే స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ని ప్రకటిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ లో వినియోగదారులు రెడ్‌మి సీరిస్ ఫోన్లను గెలుచుకునే అవకాశం ఉంది.

ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు

ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు

షియోమి తన ఫ్లాష్‌ ​సేల్‌లో రూ. 1కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఈ స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది. లిమిటెడ్‌ సంఖ్యలో డివైస్‌లు అందుబాటులో ఉన్నాయని, ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ ప్రకారం ఈ సేల్‌ నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

షియోమి చెందిన ఇతర ఉత్పత్తులపై..

షియోమి చెందిన ఇతర ఉత్పత్తులపై..

షియోమి తన పార్ట్‌నర్ సైట్లతోపాటు, పాటు తన ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో రూ.1కే పలు షియోమీ ఫోన్లను పొందే అవకాశం కల్పిస్తోంది. వీటితో పాటు షియోమి చెందిన ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లను కూడా అందించనుంది.

రెండు స్లాట్లలో ఈ సేల్‌

రెండు స్లాట్లలో ఈ సేల్‌

సేల్ జరగనున్నఈ మూడు రోజుల్లో రెండు స్లాట్లలో ఈ సేల్‌ నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 27, 28, 29 తేదీల్లో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు రూ.1 సేల్ కొనసాగుతుంది.

రూ.1కే పొందేందుకు అవకాశం

రూ.1కే పొందేందుకు అవకాశం

ఇందులో రెడ్‌మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సీ, రెడ్‌మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్‌మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్సూల్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్‌ప్యాక్, ఎంఐ వీఆర్ ప్లేలను కేవలం రూ.1కే పొందేందుకు అవకాశం ఉంటుంది.

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

దీంతోపాటు సేల్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాప్‌లో బిడ్ టు విన్ సేల్ ను నిర్వహించనుంది. షియోమి ఉత్పత్తులపై భారీ రాయితీలను కూడా వినియోగదారులు పొందవచ్చు. ఆయా ఉత్పత్తులపై కనీసం రూ.100 రాయితీ మొదలుకొని గరిష్టంగా రూ.2500 వ‌ర‌కు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది.

మరిన్ని వివరాలకు షియోమి అధికారిక వెబ్‌సైట్‌ను

మరిన్ని వివరాలకు షియోమి అధికారిక వెబ్‌సైట్‌ను

ఈ సేల్ పై మరిన్ని వివరాలకు షియోమి అధికారిక వెబ్‌సైట్‌ను, ఎంఐ యాప్‌ను పరిశీలించాల్సిందే.

Best Mobiles in India

English summary
Redmi Diwali sale: You can buy Xiaomi mobile phones for just Re 1; here is how more News At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X