Just In
- 57 min ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 4 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 6 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- Sports
INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్
- News
తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు సవివరంగా బదులిచ్చిన ప్రధాని మోడీ
- Movies
తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ వివరణ.. ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అద్భుతమైన ఫీచర్లతో Redmi K50i భారత్‌లో విడుదల.. ధర ఎంతంటే!
Xiaomi కంపెనీ భారత్‌లో K Series మొబైల్స్‌ను మళ్లీ ప్రారంభించింది. Redmi K50i స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దాంతో పాటుగా Redmi Buds 3 Lite TWS ఇయర్‌ఫోన్స్ ను కూడా బుధవారం విడుదల చేసింది. Redmi K50i మొబైల్ వేపర్ కూలింగ్ చాంబర్ ఆధారిత octa-core MediaTek Dimensity 8100 SoC ప్రాసెసర్‌తో వస్తోంది. దీని డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్‌రేటుతో పనిచేస్తుంది. కాగా, ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్లు, ధరల గురించి మనం తెలుసుకుందాం.

Redmi K50i ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD + (1,080x2,460 pixels) LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ octa-core MediaTek Dimensity 8100 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాటర్ లేదా డస్ట్ రెసిస్టాన్స్ రేటింగ్ ఫీచర్తో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ సహకారంతో పనిచేస్తుంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6GB RAM + 128GB | 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది.
ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సల్ క్వాలిటీలో Samsung ISOCELL GW1 లెన్స్ కలిగి ఉంది. మరో రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్(అల్ట్రా వైడ్ లెన్స్), 2 మెగాపిక్సెల్ క్వాలిటీ (మాక్రో లెన్స్)ని కలిగి ఉన్నాయి. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5080 mAh సామర్థ్యం గల బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయల్ సిమ్ స్లాట్స్, రెండిటికీ 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉంది. 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.3 ఫీచర్లను కలిగి ఉంది.
భారత మార్కెట్లో ఈ మొబైల్ ధరలు:
భారత మార్కెట్లో Redmi K50i బేస్ వేరియంట్ 6GB RAM + 128GB ధర రూ.25,999 గా నిర్ణయించారు. మరో వేరియంట్ 8GB RAM + 256GB ధర రూ.28,999 గా నిర్ణయించారు. ఈ మొబైల్ క్విక్ సిల్వర్, ఫాంటం బ్లూ, స్టెల్త్ బ్లాక్ కలర్లలో ఇది అందుబాటులో ఉంది. జులై 23 వ తేదీ నుంచి ఈ మొబైల్ కొనుగోలు దారులకు అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ ద్వారా లేదా ఎంఐ స్టోర్, అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ కార్డుదారులకు ఈ మొబైల్ కొనుగోలు పై రూ.3వేల డిస్కౌంట్ లభించనుంది. అంతేకాకుండా రూ.2,500 వరకు ఎక్స్చేంజీ బోనస్ పొందవచ్చు. ఇది ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో విడుదలైన Redmi Note 11T Pro కు రిబ్రాండెడ్ వర్షన్‌గా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Redmi Buds 3 Lite TWS ఇయర్‌బడ్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ Redmi Buds 3 Lite 7 ఎంఎం డైనామిక్ డ్రైవర్స్ కలిగి ఉన్నాయి. ఇవి రెడ్‌మీ కంపెనీ నుంచి విడుదలైన తొలి డబల్ టైర్‌డ్ సిలికాన్ ఇయర్ బడ్స్. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందించడానికి దీనికి IPX5 టెక్నాలజీ కోటింగ్ అందించారు. బ్లూటూత్ వర్శన్ 5.2 ని ఇది కలిగి ఉంది. ఈ బడ్స్ ఇన్విరాన్‌మెంటల్ నాయిస్‌ను తగ్గించి మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. USB టైప్-సి ద్వారా దీన్ని ఛార్జ్ చేయవచ్చు. 10 నిమిషాల ఛార్జ్ తో 100 నిమిషాల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను పొందగలదని Redmi పేర్కొంది. బడ్స్ మరియు కేస్ రెండూ కనెక్టివిటీ మరియు బ్యాటరీ స్థితి కోసం LED ఇండికేటర్‌లను కలిగి ఉంటాయి. TWS ఇయర్‌ఫోన్‌లు దుమ్ము మరియు నీటి రెసిస్టాన్స్ కోసం IP54 రేటింగ్‌తో వస్తాయి.
భారత మార్కెట్లో వీటి ధర:
భారత మార్కెట్లో ఈ Redmi Buds 3 Lite TWS ఇయర్ బడ్స్ ధర రూ.1,999 గా నిర్ణయించారు. ఇవి బ్లాక్ కలర్‌లో అందుబాటులోకి రానున్నాయి. జులై 31 వ తేదీ నుంచి ఈ మొబైల్ కొనుగోలు దారులకు అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ ద్వారా లేదా ఎంఐ స్టోర్, అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. సేల్ ప్రారంభం అయిన తర్వాత 48 గంటల్లో వీటిని కంపెనీ రూ.1,499 కే అందించనుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470