200MP కెమెరాతో Redmi నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

|
Redmi

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల తయారీ సంస్థ మరో అద్భుతమైన మొబైల్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. Redmi note 12 Pro+ పేరుతో వస్తున్న ఈ మొబైల్ గురువారం చైనాలో ప్రారంభం కానుంది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది 200MP Samsung HPX ప్రధాన కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. ఈ కెమెరాతో, వినియోగదారులు 8K 30fps మరియు 4k 120fpsలో రికార్డ్ చేయగలరని భావిస్తున్నారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో వెల్లడి;

సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో వెల్లడి;

Redmi సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Weiboలో ఒక పోస్ట్‌ను ద్వారా ఈ కొత్త మొబైల్ కు సంబంధించి విషయాలను ధృవీకరించింది. ఈ రాబోయే మొబైల్ లో ఇమేజ్ క్వాలిటీని బాగా మెరుగుపరచడానికి హై-ఎండ్ ALD యాంటీ గ్లేర్ కోటింగ్‌ కలిగిన కెమెరా సెన్సార్ అందిస్తున్నట్లు పోస్ట్ పేర్కొంది.

హై క్వాలిటీ రిసొల్యూషన్తో ఫొటో క్యాప్చర్;

హై క్వాలిటీ రిసొల్యూషన్తో ఫొటో క్యాప్చర్;

Redmi Note 12 Pro+ మొబైల్లో 200MP కెమెరా సెన్సార్ మూడు రికార్డింగ్ మోడ్‌లతో వస్తుంది. 4080 x 3060 పిక్సెల్‌ల వద్ద చిత్రాలను క్యాప్చర్ చేయడానికి, దీన్ని 12.5MPకి సెట్ చేయవచ్చు. అదే సెన్సార్‌ను 8160 x 6120 పిక్సెల్‌ల వద్ద చిత్రాలను షూట్ చేయడానికి 50MP వద్ద సెట్ చేయవచ్చు, ఆపై వినియోగదారులు 200MP వద్ద 16320 x 12240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌లో చిత్రాలను కూడా క్యాప్చర్ చేయగలుగుతారు.

Redmi Note 12 సిరీస్ స్పెసిఫికేషన్‌ల(రూమర్లు);

Redmi Note 12 సిరీస్ స్పెసిఫికేషన్‌ల(రూమర్లు);

Redmi Note 12 Pro+ FHD+ రిజల్యూషన్‌తో కూడిన OLED డిస్‌ప్లేను మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని లీక్‌లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని సూచిస్తున్నప్పటికీ, ఫోన్‌లు వాటి పాత మోడల్స్ మాదిరిగానే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయని అనేక నివేదికలు నొక్కి చెబుతున్నాయి.

210W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది;

210W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది;

తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా 200MP కెమెరా సెన్సార్ నుండి చిత్రాలు మరియు వీడియోలు కూడా అద్భుతంగా ఉంటాయి. Redmi Note సిరీస్ కూడా 210W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో ప్రత్యేక ఎడిషన్ పరికరంతో వస్తుందని భావిస్తున్నారు. Redmi Note 12 Pro+ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు. చైనా మార్కెట్‌కి లాంచ్ అవడానికి సమయం దగ్గరలో ఉంది. Redmi Note 12 సిరీస్ యొక్క గ్లోబల్ లభ్యతకు సంబంధించి రాబోయే నెలల్లో సమాచారం కోసం వేచి చూడాాలి.

అదేవిధంగా, భారత్లో గత నెలలో విడుదలైన బడ్జెట్ మొబైల్ Redmi A1 గురించి కూడా తెలుసుకుందాం;

అదేవిధంగా, భారత్లో గత నెలలో విడుదలైన బడ్జెట్ మొబైల్ Redmi A1 గురించి కూడా తెలుసుకుందాం;

Redmi A1 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
Redmi A1 డ్యూయల్ సిమ్ (నానో) ఫీచ‌ర్ క‌లిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ర‌న్ అవుతుంది. ఈ మొబైల్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 2GB RAMతో జతచేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio A22 SoC ప్రాసెస‌ర్ ద్వారా శక్తిని పొందుతుంది. Redmi A1 మొబైల్ 32GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని క‌లిగి ఉంది. అంతేకాకుండా, మైక్రో SD కార్డ్ (512GB వరకు) ఎక్స్‌ప్యాండ‌బుల్ స‌పోర్టు ఇస్తుంది.

కెమెరాల విష‌యానికొస్తే, Redmi A1 మొబైల్ LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ AI బ్యాక్‌డ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రైమ‌రీ కెమెరా 8-మెగాపిక్సెల్ క్వాలిటీ సెన్సార్‌తో కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, ఫోన్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇంకా, Redmi A1 20 కంటే ఎక్కువ భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ పొడవు 164.67 మిమీ మరియు వెడల్పు 76.56 మిమీ ఉంటుంది.

5000mAh బ్యాట‌రీ:

5000mAh బ్యాట‌రీ:

అదనంగా, ఛార్జ్ విష‌యానికొస్తే.. Redmi A1 మొబైల్ 5000mAh బ్యాటరీతో ఉంటుంది. దీనికి 10W ఛార్జ‌ర్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. డివైజ్ కుడి వైపున‌ పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇది బడ్జెట్ డివైజ్ కాబట్టి ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఉండే అవకాశం లేదు. త్వ‌ర‌లోనే ఈ బ్రాండ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్న ప్లస్ వేరియంట్‌ను కూడా తీసుకువస్తుందని మైక్రోసైట్ పేర్కొంది. అయితే దానిపై అధికారిక నిర్ధారణ లేదు. Redmi A1 స్మార్ట్‌ఫోన్ ర్యామ్ మ‌రియు ఇంట‌ర్నల్ స్టోరేజీ ఆధారంగా ఒక‌టే వేరియంట్లో భార‌త మార్కెట్లో లాంచ్ అయింది. 2GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ ధ‌ర‌ను కంపెనీ రూ.6,499 గా నిర్ణ‌యించింది. ఇది క్లాసిక్ బ్లాక్, లైట్ గ్రీన్ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Best Mobiles in India

English summary
Redmi note 12 pro plus packing with 200MP camera, check for lauch date.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X