Home
Mobile

రూ.15,000 కంటే తక్కువ ధరకే 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్ల తయారీ సంస్థ రెడ్‌మి నుంచి గత సంవత్సరం రెడ్‌మి నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi Note 13 5G Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

స్టోరేజీ, కలర్‌ వేరియంట్స్‌ :
రెడ్‌మి నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఆర్కిటిక్ వైట్‌, క్రోమాటిక్‌ పర్పుల్‌, ప్రిజమ్‌ గోల్డ్‌, స్టెల్త్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది.

Redmi Note 13 5G Smartphone

డిస్కౌంట్‌ ధరలు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) 6GB ర్యామ్ Arctic White కలర్‌ వేరియంట్‌ను రూ.14,499 కే సొంతం చేసుకోవచ్చు. మిగిలిన కలర్‌ వేరియంట్స్‌ను రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16990 గా ఉంది. అదే 12GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.18300 గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో 5 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు HDFC, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి బ్యాంకు కార్డులతో మరింత అదనపు తగ్గింపు ధరకే ఈ రెడ్‌మి నోట్‌ 13 5G హ్యాండ్‌సెట్‌ను (Redmi 5G Phones) సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మి నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో లభిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణను కలిగి ఉంటుంది.

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. Mali G57 GPU తో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ రెండు సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.7 అపేచర్‌తో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP మ్యాక్స్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 16MP సెల్ఫీ కెమెరాలను అమర్చారు.

భారీ బ్యాటరీ :
ఛార్జింగ్‌, బ్యాటరీ లైఫ్‌ పరంగాను మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌తోపాటు ప్రో, ప్రో ప్లస్‌ మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Redmi Note 13 5G Smartphone gets best price deal on flipkart check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X