Home
Mobile

200MP కెమెరా, 5100mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌, రెడ్‌మి బడ్స్‌పై డిస్కౌంట్‌.. స్పెసిఫికేషన్‌లు, సేల్‌ వివరాలు

రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం జనవరిలో భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. నోట్‌ 13 ప్రో 5G (Redmi Note 13 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మి బడ్స్‌ 5 ఇయర్‌బడ్స్‌.. రెండింటినీ కొనుగోలు చేయడం ద్వారా మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఆఫర్‌ను Mi.com ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ బండిల్‌ ఆఫర్‌లో భాగంగా.. రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ మోడల్‌ ధర రూ.24,999 గా ఉంది. అదే రెడ్‌మి బడ్స్‌ 5 TWS ధర రూ.2,699 గా ఉంది.

redmi note 13 pro 5G and redmi buds 5 gets best smart bundle offer 2024

రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌.. కోరల్‌ పర్పుల్‌, ఆర్కిటిక్‌ వైట్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అదే బడ్స్‌ (Redmi Buds 5).. ఫ్యూజన్‌ వైట్‌, ఫ్యూజన్‌ పర్పుల్‌, ఫ్యూజన్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం Mi.com లోనే ఈ స్మార్ట్‌ బండిల్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌, ఇయర్‌బడ్స్‌ ధరలు రెండు కలిపితే రూ.27,698 గా ఉంది. అదే స్మార్ట్‌ బండిల్‌ ఆఫర్‌లో భాగంగా రూ.26,598 కే కొనుగోలు చేయవచ్చు. అయితే కేవలం స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే కొనుగోలు చేస్తే.. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దాంతోపాటు షియోమీ, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ఎక్స్చేంజీ ద్వారా రూ.3000 అదనపు తగ్గింపును పొందవచ్చు.

redmi note 13 pro 5G and redmi buds 5 gets best smart bundle offer 2024

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది.

ఈ రెడ్‌మీ నోట్‌ 13 ప్రో హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ సహా Adreno A710 GPU పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 OS పైన పనిచేస్తుంది. ఈ రెడ్‌మి నోట్‌ స్మార్ట్‌ఫోన్‌ 67W ఛార్జింగ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలేజైషన్‌) సపోర్టుతో 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి బడ్స్ 5 ఇయర్‌బడ్స్‌ 12.4mm డైనమిక్‌ డ్రైవర్‌లను కలిగి ఉంటుంది. మరియు టైటానియం డయాఫ్రమ్‌ సహా హైబ్రిడ్‌ 46dB ANC ఫీచర్‌ను కలిగి ఉంటుంది. బ్లూటూత్‌ 5,3, డ్యూయల్‌ డివైస్‌ పెయిరింగ్‌, షియోమీ ఇయర్‌బడ్స్‌ యాప్‌ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌ ఛార్జింగ్‌ కేస్‌ 480mAh బ్యాటరీ మరియు ప్రతి బడ్‌ 54mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ద్వారా 38 గంటలపాటు ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
redmi note 13 pro 5G and redmi buds 5 gets best smart bundle offer 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X