Home
Mobile

200MP కెమెరా, 108MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌ల కొత్త వేరియంట్‌లు విడుదల.. ధర, సేల్‌ వివరాలు.. !

రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G మరియు రెడ్‌మి నోట్‌ 13 5G స్మార్ట్‌ఫోన్‌ల కొత్త కలర్‌ వేరియంట్‌లు విడుదల అయ్యాయి. నోట్‌ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్కార్లెట్‌ రెడ్‌ (Redmi Note 13 Pro 5G scarlet red colour smartphone) రంగులో కొత్తగా లాంచ్‌ అయింది. అదే నోట్‌ 13 హ్యాండ్‌సెట్‌ క్రొమాటిక్‌ పర్పుల్ (Redmi Note 13 5G Chromatic Purple Colour Smartphone) రంగులో విడుదల అయింది. ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాంలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, సంస్థ అధికారిక స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు : రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5k కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 OS పైన పనిచేస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

Redmi Note 13 Pro 5G scarlet red

రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 200MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2MP మాక్రో సెన్సార్‌ను అమర్చారు. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 67W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G కొత్త వేరియంట్ ధర :
రెడ్‌మి నోట్‌ 13 ప్రో 5G స్కార్లెట్‌ రెడ్‌ కలర్‌ వేరియంట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.

Redmi Note 13 Pro 5G scarlet red

SBI క్రెడిట్‌ కార్డు, ICICI బ్యాంకు, HDFC బ్యాంకు, యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ Mi.com లో స్కార్లెట్‌ రెడ్ కలర్‌ వేరియంట్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంది.

రెడ్‌మి నోట్‌ 13 5G క్రోమాటిక్ పర్పుల్‌ కలర్‌ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి నోట్‌ 13 5G క్రోమాటిక్ పర్పుల్‌ కలర్‌ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 108MP+ 8MP+ 2MP కెమెరాను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. మరియు 33W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. Mi.com, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సహా ఇతర ఫ్లాట్‌ఫాంలో కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్+ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.18999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది. SBI, యాక్సెస్‌, HDFC, ICICI బ్యాంకు డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి రూ.1500 తగ్గింపును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 13 Pro 5G and Redmi note 13 5G new variants launched in india sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X