200MP కెమెరా, 5100mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్.. స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
రెడ్‌మి నోట్ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో జనవరి 2023 లో విడుదల అయింది. ఈ ప్రో వెర్షన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. తాజాగా మరో కొత్త కలర్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన దేశాల్లో ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ ప్రో మోడల్ మూడు ర్యామ్, స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. తాజాగా రెడ్‌మి నోట్ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఓలివ్ గ్రీన్ రంగులో ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ భారత్‌లో ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.
రెడ్‌మి నోట్ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Redmi Note 13 Pro 5G Smartphone New Variant) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28999 గా ఉంది. కొత్త వేరియంట్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కావాల్సి ఉంది.

రెడ్‌మి నోట్ 13 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి నోట్ 13 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల 1.5k కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది.
రెడ్‌మి నోట్ 13 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS ను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7s జెన్ SoC చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది.
200MP కెమెరా :
ఈ రెడ్‌మి స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 200MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రావైడ్ యాంగిల్, 2MP మాక్రో సెన్సార్‌ను అమర్చారు. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
5100mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 67W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.2, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








