Home
Mobile

షియోమీ ప్రత్యేక సేల్‌.. 200MP కెమెరా, 256GB స్టోరేజీ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు.. పూర్తి వివరాలు..!

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ షియోమీ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. Xiaomi independence day sale 2024 పేరుతో సేల్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ షియోమీ సేల్‌లో భాగంగా తమ స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర గ్యాడ్జెట్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను (Redmi Note 13 pro Plus Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా తగ్గింపు ధరను పొందవచ్చు.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29,999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.31,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.

Redmi Note 13 pro Plus Smartphone price drop during Xiaomi independence day sale 2024

ICICI బ్యాంకు, HDFC, యాక్సెస్‌, SBI, కోటక్‌ బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ.2000 తగ్గింపు ధరను పొందవచ్చు. ఎక్స్చేంజీ ద్వారా అదనంగా రూ.2500 తగ్గింపును పొందవచ్చు. వీటితోపాటు నో - కాస్ట్ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ARM G610 MC4 GPU తో జతచేయబడి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 (Out of the box) ఆధారిత MIUI 14 OS ను కలిగి ఉంది. 3 OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని రెడ్‌మి తెలిపింది.

ఈ రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ తో 200MP కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

120W హైపర్‌ ఛార్జ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌, స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 13 pro Plus Smartphone price drop during Xiaomi independence day sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X