రెడ్‌మి నోట్ 13 టర్బో ఫోన్ కీలక ఫీచర్లు లీక్.. భారత్‌లో ఈ ఫోన్ ఏ పేరుతో విడుదల కానుందంటే..?
రెడ్‌మి నోట్ 13 టర్బో స్మార్ట్‌ఫోన్ (Redmi Note 13 Turbo) త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందే టిప్‌స్టర్ ఈ హ్యాండ్‌సెట్ వివరాలను లీక్ చేశారు. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ తోపాటు OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అయితే చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా పోకో బ్రాండ్‌పైన లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ఆధారంగా ఈ రెడ్‌మి నోట్ 13 టర్బో హ్యాండ్‌సెట్ 1.5K OLED స్క్రీన్‌తోపాటు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 90W వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 50MP సోనీ IMX882 సెన్సార్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే మిగిలిన కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 20MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు రెడ్‌మి నోట్ 12T మరియు రెడ్‌మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ తరహా డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
భారత్‌లో ఈ పేరుతో విడుదల కానుంది? : గత సంవత్సరం రెడ్‌మి నోట్ 12 టర్బో చైనాలో లాంచ్ అయింది. అదే ఫోన్ భారత్‌లో పోకో F5 పేరుతో విడుదల అయింది. ప్రస్తుతం తర్వాత వెర్షన్ హ్యాండ్‌సెట్ రెడ్‌మి నోట్ 13 టర్బో గా చైనాలో లాంచ్ కానుంది.
భారత్ సహా ఇతర దేశాల్లో పోకో F6 గా లాంచ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుత లీక్‌ల ఆధారంగా ఒకే తరహా స్పెసిఫికేషన్లు కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
** ఇటీవలే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా షియోమీ 14 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ 6.36 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే, 460ppi పిక్సల్ డెన్సిటీ, 1Hz నుంచి 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది.
షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ ఈ స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్ 12GB LPDDR5 ర్యామ్, 512GB UFS 4,0 స్టోరేజీతో జతచేయపడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. ఈ షియోమీ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మాస్ మరియు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ Leica బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Summilux లెన్స్‌ను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మరియు f/1.6 అపేచర్‌తో 50MP కెమెరా, 75mm ఫ్లోటింగ్ లెన్స్ టెక్నాలజీతో కూడిన 50MP టెలిఫోటో కెమెరా, 115 డిగ్రీ ఫీల్డ్ వ్యూ 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








