Home
Mobile

ఈ స్మార్ట్‌ఫోన్‌ పై రూ.2500 డిస్కౌంట్‌.. 50MP కెమెరా, 5110mAh బ్యాటరీ, సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే..!

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2025 సేల్‌ నిన్నటి నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. దీంతోపాటు SBI బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. రెడ్‌మి నోట్‌ 14 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. ఈ ఫోన్‌ గత సంవత్సరం డిసెంబర్‌లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, సేల్ పూర్తి వివరాలు.

భారత్‌ మార్కెట్‌లో రెడ్‌మి నోట్‌ 14 5G సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 14 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi Note 14 5G SmartPhone) మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,999 గా ఉండేది.

Redmi Note 14 5G smartphone now available at Rs16 498 Price on amazon  features

అదే 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.19,999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ల ధరలు వరుసగా రూ.16,498, రూ.16,998, రూ.18,998 గా ఉంది. SBI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి నోట్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది. TUV ట్రిపుల్‌ ఐ కేర్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లకు హాని కలగకుండా ఉంటుంది.

Redmi Note 14 5G smartphone now available at Rs16 498 Price on amazon  features

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే హైడ్రో టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను నియంత్రించవచ్చు. మరియు ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను అమర్చి ఉంది. 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

45W టర్బో ఛార్జింగ్ :
ఈ రెడ్‌మి నోట్‌ 14 5G స్మార్ట్‌ఫోన్ 45W టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది. 4 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ అందిస్తుందని చెబుతోంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. AI Erase, AI Magic Sky వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. బ్లూటూత్‌, వైఫై, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. IR బ్లాస్టర్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Note 14 5G smartphone now available at Rs16,498 Price on amazon, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X